Oct 03 2026అక్టోబరు 03 2026favorite_border

కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 03 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: సప్తమి ఉ.10.00 కు తదుపరి అష్టమి 4 ఉ.7.32 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: ఆర్ద్ర 4 తె.4.10 కు తదుపరి పునర్వసు 4 రా.2.32 కు
యోగం: వరీయాన్ మ.3:21 కు తదుపరి పరిఘ 4 మ.12:31 కు
కరణం: బవ ఉ. 8.00 కు, బాలవ సా.6.55 కు తదుపరి కౌలవ 4 తె.5.52 కు
రాహుకాలం: ఉ. 09.00 – 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 7.45 – 8.32 కు
వర్జ్యం: ప.1.39 – 3.08 కు
అమృతకాలం: సా. 04.05 – 05.35 కు
సూర్యోదయం: ఉ. 6.10 కు
సూర్యాస్తమయం: సా. 6.00 కు

🕉️ పితృపక్షాలు 7 వ దినము, సూర్యసావర్ణి మన్వాది, మధ్యాష్టమి, విషువత్ పుణ్యకాలం, కలియుగాది 🕉️

గురుబోధ:
🕉️పిండమును బాగా చేపలు ఎక్కువ ఉన్ననీటిలో విడవవచ్చు. కుదరని పక్షంలో భూమిలో పాతిపెట్టవచ్చు లేదా గోవుకు తినిపించవచ్చు. ఎంత గొప్పగా శ్రాద్ధం నిర్వహించినా గోవులకు గ్రాసం అందిచకపోతే సంపూర్ణం కాదని శాస్త్రం.
🕉️పితృ కార్యాలు జరిగేటప్పుడు కర్త కాకుండా ఇతరులు ఏమి చెయవచ్చు?
◆ వేద పారాయణ, పురాణ పారాయణ, భగవద్గీత, కఠ ఉపనిషత్, బ్రహ్మదత్తుని కథ (హరివంశం), పితృ స్తవం, శివకేశవ అష్టోత్తరం, వాసుదేవ శతనామాలు.
శ్లో౹౹ సప్తవ్యాధా దశార్ణేషు మృగాకాలంజరే గిరౌ |
చక్రవాకా శరద్వీపే హంసాః సరసి మానసే ||
తేఽభిజాతా కురుక్షేత్రే బ్రాహ్మణా వేదపారగాః ||
ప్రస్థితా దీర్ఘమధ్వానం యూయం కిం అవసీధత ||
శ్రాద్ధఫలితం సంపూర్ణంగా లభించాలంటే పై రెండు శ్లోకాలను తప్పకుండా పారాయణం చేసి తీరాలి.

పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial

expand_less