కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 03 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: ఏకాదశి సా.4.56 కు తదుపరి ద్వాదశి 4 మ.3.50 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: శ్రవణం ఉ.6.48 కు తదుపరి ధనిష్ఠ 4 ఉ.6.59 కు
యోగం: ధృతి రా.8:45 కు తదుపరి శూల 4 రా.7:26 కు
కరణం: వణిజ ఉ. 6:58 కు తదుపరి విష్టి సా.6.33 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:32-9:19 కు, మ. 12:28-1:16 కు
వర్జ్యం: ఉ.10.49-12.25 కు
అమృతకాలం: రా.10.56-12.30 కు
సూర్యోదయం: ఉ. 5:54 కు
సూర్యాస్తమయం: సా. 5:47 కు
🕉️ ఆశ్వయుజ శుద్ధ ఏకాదశి, సర్వ ఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఈరోజు ఉండాలి. ద్వాదశీపారణ రేపు చెయ్యాలి.
గురుబోధ:
సద్గురువులు, జగద్గురువుల నోటి వెంబడి వచ్చే ఏ వాక్కైనా శాస్త్రసమ్మతమే. ఇక దాంట్లో ఎటువంటి సందేహానికి తావు ఉండదు. ఇందుకు తార్కాణంగా, శ్రీరాముడు అనే గోపబాలుడు తమ గురువైన గర్గాచార్యుని ఆదేశం మీద ఒకసారి శ్రీకృష్ణ పరమాత్మకు కుళ్ళిపోయిన పువ్వులను సమర్పించాడు. అతడికి శ్రీకృష్ణ పరమాత్ముడు శాశ్వత గోలోకాన్ని అనుగ్రహించాడు, అటువంటి ఉత్తమగతులు కేవలం గురువాజ్ఞను ఎటువంటి ధిక్కారము లేకుండా పాటించడం వల్ల మాత్రమే దక్కాయి.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
https://youtu.be/DpjBm71jA_s?si=P3uhz2umkoo8lmNX