కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 03 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: పాడ్యమి రా. 12.47 కు తదుపరి విదియ 04 రా. 02.47 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: హస్త మ. 2.57 కు తదుపరి చిత్త 04 సా. 05.31 కు
యోగం: ఐంద్ర 04 తె. 04.24 కు తదుపరి వైధృతి 05 తె. 05.22 కు
కరణం: కింస్తుఘ్న మ. 01.38 కు తదుపరి బవ రా. 02.58 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.06 - 10.53 కు & మ. 02.52 - 03.40 కు
వర్జ్యం: రా. 11.48 - 1.34 కు
అమృతకాలం: ఉ. 8.18 - 10.04 కు
సూర్యోదయం: ఉ. 6.07 కు
సూర్యాస్తమయం: సా. 6.03 కు
🕉️ శరన్నవరాత్రులు 1వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ బాలాత్రిపుర సుందరీదేవి అలంకారం 🕉️
గురుబోధ:
అమ్మవారికి ఇష్టమైనవి 4 మాసాలు ఆశ్వయుజ మాసం, మాఘ మాసం, చైత్ర మాసం, వైశాఖ మాసం. వసంత నవరాత్రులు , శరత్ కాలంలో వచ్చే నవరాత్రులు (అనగా శుక్ల పక్షం లో పాడ్యమి మొదలు నవమి వరకు) ఇవి రెండూ అమ్మకి మరింత ఇష్టం. శరన్నవరాత్రులు యముని కోరలు (మృత్యు దేవత స్వరూపం). ఒకానొకప్పుడు అమ్మవారు అతి భయంకరమైన యమ దంష్ర్ట లాంటి సంధి కాలంలో ఋతువు నుంచి ఋతువు మారే క్రమంలో మానవులు రోగముల నుండి విముక్తి పొందడానికి సులభోపాయం చెప్తున్నాను అని నేను చెప్పినట్టుగా చేసుకుంటే మానవులకు వారికున్న రోగాలు తొలగిపోతాయి. పాడ్యమి మొదలు నవమి వరకు 9 రోజుల పాటు నన్ను భక్తి శ్రద్ధలతో పూజించండి. 10 వ రోజు విజయదశమినాడు చేయవలసిన కార్యక్రమాలు మానవులకి నేను విధిస్తున్నాను, వాటి ప్రకారం నన్ను ఆ 10 రోజులు విశేషంగా అలంకారం చేసి పసుపుతో, కుంకుమతో వివిధమైన పుష్పాలతో, ఫలాలతో, ధూపంతో, దీపంతో, నైవేద్యాలతో నన్ను అర్చిస్తే అటువంటి వారికి మాటవరుసకు కూడా అనారోగ్యం లేకుండా చేస్తాను, వాళ్ళని బాగుపరుస్తాను" అని పలికింది.
https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial