కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 02 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం
తిథి: షష్ఠి ప.12.23 కు తదుపరి సప్తమి 3 ఉ.10.00 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: రోహిణి ఉ.7.29 కు, మృగశిర 3 తె.5.51 కు తదుపరి ఆర్ద్ర 4 తె.4.10 కు
యోగం: వ్యతీపాత సా.6:17 కు తదుపరి వరీయాన్ 3 మ.3:21 కు
కరణం: వణిజ ఉ.10:15 కు, విష్టి రా.9:07 కు తదుపరి బాలవ సా.6:55 కు
రాహుకాలం: ఉ. 10.30 – 12.00 కు
దుర్ముహూర్తం: ఉ. 8.32 – 9.19 కు, మ. 12.29 – 1.16 కు
వర్జ్యం: ప.12.41 – 2.11 కు
అమృతకాలం: సా. 06.40 – 08.10 కు
సూర్యోదయం: ఉ. 6.10 కు
సూర్యాస్తమయం: సా. 6.00 కు
🕉️ మహాలయ పక్షారంభము (పితృపక్షములు), 6వ రోజు, వ్యతీపాత మహాలయం 🕉️
గురుబోధ:
🕉️ప్రతి సంవత్సరము అర్హత కల్గినవారు పితృతర్పణములు 96 పర్వదినములలో ఇవ్వడం మంచిదని ధర్మశాస్త్రం. దానినే షణ్ణవతి శ్రాద్ధం లేదా తర్పణ పుణ్యకాలం అంటారు. అవి 12 అమావాస్యలు, 12 సంక్రమణలు, 14 మన్వంతరములు, 4 ఉగాదులు (కృత, త్రేత, ద్వాపర, కలి ఉగాదులు) – మాఘ అమావాస్య, భాద్రపద కృష్ణ త్రయోదశి, వైశాఖ శుక్ల తృతీయ, కార్తిక శుక్ల నవమి), వైధృతి కరణములు – 13, వ్యతీపాత యోగములు – 13, మహాలయ పక్షములు, అష్టక శ్రాద్ధములు (మార్గశీర్షం, పుష్యం, మాఘం , ఫాల్గునం – బహుళ (కృష్ణ) పక్షం సప్తమి, అష్టమి, నవమి) వంటి పర్వదినములలో చేయడం వలన పితృదేవతల అనుగ్రహం సంపూర్ణంగా కలుగుతుంది.
🕉️భూలోక వాసులకు 24 గంటలు ఒకరోజు, పితృదేవతలకు 30 రోజులు ఒక రోజు, దేవతలకు 365 రోజులు ఒక రోజు. కాబట్టి నెలకు ఒకసారి పెడితే వారికి రోజూ ఆహారం అందించిన వారమవుతాము.
పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw