Oct 02 2025అక్టోబరు 02 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 02 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం

తిథి: దశమి సా.4.40 కు తదుపరి ఏకాదశి 3 సా.4.56 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ ఉ.6.06 కు తదుపరి శ్రవణం 3 ఉ.6.48 కు
యోగం: సుకర్మ రా.11:28 కు తదుపరి ధృతి 3 రా.8:45 కు
కరణం: గరజి రా.7.11 కు తదుపరి వణిజ 3 ఉ. 6:58 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:07-10:54 కు, మ. 2:51-3:38 కు
వర్జ్యం: ఉ.10.13-11.51 కు
అమృతకాలం: రా.11.01-12.38 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు

🕉️ విజయదశమి - శరన్నవరాత్రులు 11వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ స్వర్ణకవచాలంకృత శ్రీమాత అలంకారం 🕉️

గురుబోధ:
🕉️దశమి నాడు అమ్మని పూజిస్తే ముల్లోకాధిపత్యం పొందుతారు. అందుకే పూర్వం ఇంద్రుడు అమ్మవారిని పూజించి ఇంద్రపదవిని తిరిగి పొందాడు.
🕉️విజయదశమి నాడు ఏ శుభకార్యము తలపెట్టినా, అది దిగ్విజయం అవుతుందని ప్రతీతి. ఆశ్వయుజమాసం శ్రవణానక్షత్రము నాడు శ్రీ వేంకటేశ్వర స్వామివారు తిరుమల క్షేత్రంలో అవతరించారు. దశమి నాడు తప్పక శమీపూజ చేసి, ఈ క్రింది శ్లోకాలను చదువుకొంటే సకల పాపాలు తొలగిపోతాయి, శుభాలు కలుగుతాయి. జమ్మిచెట్టుకి (శమీవృక్షం) 5 ప్రదక్షిణలు చేయాలి.
1. శమీ శమయతే పాపం శమీ శత్రువినాశినీ
అర్జునస్య ధనుర్ధారీ  రామస్యాక్లిష్ట కర్మిణీ
2. శమీ శమయతే పాపం శమీ లోహితకంటకా
ధారిణ్యర్జునబాణానాం రామస్య ప్రియవాదినీ

expand_less