కాలం – అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి – సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము – ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము – పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం – కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 01 2026 🌟
శ్రీ పరాభవ నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం
తిథి: బ.పంచమి ప.2.45 కు తదుపరి షష్ఠి 02 ప.12.23 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: కృత్తిక ఉ.9.04 కు తదుపరి రోహిణి 02 ఉ.7.29 కు, మృగశిర 03 తె.5.51 కు
యోగం: సిద్ధి రా.9:17 కు తదుపరి వ్యతీపాత 02 సా.6:17 కు
కరణం: తైతుల మ.12:35 కు, గరజి రా.11:25 కు తదుపరి వణిజ 02 ఉ.10:15 కు
రాహుకాలం: మ. 01.30 – 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.07 – 10.54 కు, మ. 2.51 – 3.39 కు
వర్జ్యం: రా.12.00 – 1.30 కు
అమృతకాలం: తె. 01.27 – 02.57 కు
సూర్యోదయం: ఉ. 6.10 కు
సూర్యాస్తమయం: సా. 6.01 కు
🕉️ మహాలయ పక్షారంభము (పితృపక్షములు), 5వ రోజు 🕉️
గురుబోధ:
🕉️పితృదేవతలు 7 రకముల గణములు. అందులో 3 మూర్తి (రూపం) లేని గణములు ; 4 మూర్తి గణములు.
మూర్తి (రూపం) లేని గణములు
- వైరాజులు
- అగ్నిష్వాత్తులు
- బర్హిషదులు
మూర్తి గణములు - సుకాలినులు
- హవిష్మంతులు
- ఆజ్యపులు
- సోమపులు – (శ్రీ మత్స్యపురాణం)
🕉️పితృదేవతలకి ఆవపిండితో చేసిన వంటలు, నువ్వులుతో వంటలు, గోధుమలతో చేసిన అప్పాలు, పెసర, మినపపప్పుతో వంటలు వండడం లేదా ఇవి దానాలు చేయడం వల్ల పితృదేవతలు తృప్తి పడతారు. స్వయంపాకమునకు కందగడ్డ, చామగడ్డ, తోటకూర, బెల్లం, చింతపండు, బెండ, కాకర, పనసకూర, ఎండుమిరప, ఆవాలు, ఆవు నెయ్యి, పంచకదళి (అరటికాయ, అరటిపండు, అరటిపువ్వు, అరటి దూట, అరటి ఆకు), పాలు, పెరుగు, నల్ల మినపపప్పు,పెసరపప్పు, అల్లం, చెఱకు రసం మొదలైనవి ఉంటే మంచిది.
పితృదేవతా స్తోత్రం👇
https://youtu.be/UgnxFM4YHYY?si=uUfkETkRGcPPOrTw