కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 01 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసము శుక్ల పక్షం
తిథి: ఆశ్వయుజ శుద్ధ నవమి సా.4.20 కు తదుపరి దశమి సా.4.40 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: ఉత్తరాషాఢ 2 ఉ.6.06 కు తదుపరి శ్రవణం 3 ఉ.6.48 కు
యోగం: అతిగండ రా.12:33 కు తదుపరి సుకర్మ 3 రా.11:28 కు
కరణం: కౌలవ మ.2.23 కు తదుపరి తైతుల రా.2:32 కు
రాహుకాలం: మ.12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:42-12:29 కు
వర్జ్యం: మ.1.28-3.02 కు
అమృతకాలం: రా.2.31-4.11 కు
సూర్యోదయం: ఉ. 5:50 కు
సూర్యాస్తమయం: సా. 6:07 కు
🕉️ మహానవమి, ఆయుధ/వాహనపూజ, స్వారోచిషమన్వాది, శరన్నవరాత్రులు 9వ రోజు- ఏలూరు శ్రీ ప్రణవపీఠంలో శ్రీ మహిషాసుర మర్దని (మహానవమి) అలంకారం 🕉️
గురుబోధ:
🕉️శరన్నవరాత్రులలో వచ్చే నవమీ తిథినాడు ఆయుధపూజ, వాహన లేదా యంత్రములకు తగిన విధంగా పూజ చేయాలి. దశమి నాడు తప్పక శమీపూజ చేయాలి.
🕉️వేదములు స్వయంగా అమ్మవారిని ఈ స్తోత్రంతో స్తుతించాయి. ఈ స్తోత్రాన్ని భక్తితో ఒక్కసారి చదివినా, విన్నా వాళ్ళలో స్వయంగా అమ్మవారు ఉంటుందని, వారికి సర్వశుభాలు ఇస్తానని అమ్మవారు వరం ఇచ్చింది.
వేదస్తుతి - అమ్మవారిని 4 వేదాలు స్తుతించిన స్తోత్రం👇
https://youtu.be/RQkosU7Ae0A?si=O0nzJTkQfytlxh7-