Oct 01 2024అక్టోబరు 01 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 అక్టోబరు 01 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్దశి రా. 8.49 కు తదుపరి అమావాస్య 02 రా. 10.41 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: పుబ్బ ఉ. 9.59 కు తదుపరి ఉత్తర 02 మ. 12.22 కు
యోగం: శుక్ల రా. 02.18 కు తదుపరి బ్రహ్మ 02 రా. 03.22 కు
కరణం: విష్టి ఉ. 08.21 కు తదుపరి శకుని రా. 09.39 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.30 - 09.18 కు & రా. 10.53 - 11.42 కు
వర్జ్యం: సా. 05.53 - 7.39 కు
అమృతకాలం: తె. 04.25 - 05:55 కు
సూర్యోదయం: ఉ. 6.06 కు
సూర్యాస్తమయం: సా. 6.05 కు

🕉️ అంగారకచతుర్దశి, మాసశివరాత్రి 🕉️

ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రము👇
https://youtu.be/Ij6aTtQF42Y?si=TmOsGcnDLMFOEnRo

గురుబోధ
◆ చతుర్దశీ తిథి మంగళవారం వస్తే ఆ పర్వదినమును అంగారకచతుర్దశి లేదా భౌమచతుర్దశి అంటారు. ఇతరులు మనకు అప్పు ఉండి ఆ అప్పు తీర్చకపోయినా, మనం ఇతరులకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వలేకపోయినా ఈ రెండు రకాల ఋణాల నుండి విముక్తి పొందడానికి భక్తి శ్రద్ధలతో ఈ కుజస్తోత్రమును పారాయణం చేయమని సాక్షాత్తూ బ్రహ్మదేవుడు కుమారస్వామికి చెప్పాడు. అందునా మంగళవారమునాడు ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా లేక విన్నా, తక్షణం ఋణవిముక్తి అవుతుంది.
◆ పితృదేవతలకు జరిపే క్రతువులలో దోషాలు ఉన్నా, ఎవరైనా బంధుమిత్రులలోని వారు అకాలమరణం పొందినా, పితరులకు ఉత్తమగతులు అందించాలన్నా ఒకే ఒక ఉత్తమ మార్గం భాగవత సప్తాహం జరిపించుట.
◆ పితృదేవతలను ఆహ్వానించే రోజు అనగా శ్రాద్ధ కర్మలు నిర్వహించే రోజు మాత్రం ఇంటి ముందు ముగ్గు వేయరాదు. అమావాస్య లేదా నైమిత్తిక తిథులలో ఇచ్చే తర్పణములకు ఈ నియమం లేదు.
◆ పిండమును బాగా చేపలు ఎక్కువ ఉన్ననీటిలో విడవవచ్చు. కుదరని పక్షంలో భూమిలో పాతిపెట్టవచ్చు లేదా గోవుకు తినిపించవచ్చు. ఎంత గొప్పగా శ్రాద్ధం నిర్వహించినా గోవులకు గ్రాసం అందిచకపోతే సంపూర్ణం కాదని శాస్త్రం.

expand_less