Oct 01 2022అక్టోబర్ 01 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 అక్టోబర్ 01 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
ఆశ్వయుజ మాసం శుక్లపక్షము 

తిథి : షష్ఠి  రాత్రి 08గం౹౹32ని౹౹ వరకు తదుపరి సప్తమి
వారం : స్థిరవారం  (శనివారం)
నక్షత్రం : జ్యేష్ఠ  తెల్లవారి 03గం౹౹57ని౹౹ వరకు తదుపరి మూల
యోగం :  ఆయుష్మాన్ ఈ రోజు రాత్రి 07గం౹౹59ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం : కౌలవ ఈ రోజు ఉదయం 09గం౹౹42ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉదయం 06గం౹౹34ని౹౹ నుండి 07గం౹౹29ని౹౹ వరకు 
వర్జ్యం : ఉదయం 10గం౹౹38ని౹౹ నుండి 12గం౹౹08ని౹౹ వరకు
అమృతకాలం : రాత్రి 07గం౹౹40ని౹౹ నుండి 09గం౹౹10ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 05గం౹౹53ని౹౹ 
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹52ని౹౹



గురుబోధ
నవరాత్రులలో ఏకభుక్తం చేయగలిగితే చాలా మంచిది. అమ్మవారిపూజకు మందారం; గానుగపూలు; అశోకం; సంపెంగ; గన్నేరు; మాలతి; బిల్వపత్రాలు; తామరపూలు; కలువపూలు (ముఖ్యంగా నల్లకలువలు) ఉండటం చాలా మంచిది. నవరాత్రులలో ప్రతిదినం వీలున్నంతవరకు అమ్మకు నైవేద్యంలో ఉండవలసిన ఫలాలు: 1. కొబ్బరికాయ  2. నిమ్మ  3. దానిమ్మ 4. అరటిపళ్ళు 5. నారింజ 6. పనస 7. మారేడుకాయ


expand_less