November 24 2021నవంబర్ 24 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 24 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం కృష్ణపక్షము

 తిథి: పంచమి రాత్రి 10గం౹౹42ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం:  పునర్వసు ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹32ని౹౹ వరకు తదుపరి పుష్యమి
యోగం: శుభ ఈ రోజు ఉదయం 07గం౹౹31ని౹౹ వరకు శుక్ల
కరణం  :  కౌలవ  ఈ రోజు మధ్యాహ్నం 02గం౹౹02ని౹౹ వరకు తదుపరి తైతుల
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 11గం౹౹24ని౹౹ నుండి 12గం౹౹09ని౹౹ వరకు 
వర్జ్యం:  రాత్రి 10గం౹౹27ని౹౹ నుండి 12గం౹౹10ని౹౹ వరకు
అమృతకాలం ఉదయం 10గం౹౹55ని౹౹ నుండి 12గం౹౹39ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹12ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹20ని౹౹ వరకు 


గురుబోధ:

సమస్త వేదపురాణాలసారం "సత్యం వద - ధర్మం చర" అనే ఉపనిషద్వాక్యం. సత్యమును పలుకడం - ధర్మమును ఆచరించడం, మనిషిని ఉద్ధరిస్తుంది.
expand_less