November 17 2021నవంబర్ 17 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 17 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం శుక్లపక్షము

 తిథి: త్రయోదశి ఉదయం 09గం౹౹51ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం:  అశ్విని ఈ రోజు రాత్రి 11గం౹౹10ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం: వ్యతీపాత ఈ రోజు పూర్తిగా ఉండి
కరణం  :  తైతుల  ఈ రోజు ఉదయం 09గం౹౹50ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ  రోజు ఉదయం 11గం౹౹23ని౹౹ నుండి 12గం౹౹08ని౹౹ వరకు 
వర్జ్యం: రాత్రి 06గం౹౹53ని౹౹ నుండి 08గం౹౹35ని౹౹ వరకు
అమృతకాలం మధ్యాహ్నం 03గం౹౹27ని౹౹ నుండి 05గం౹౹09ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹08ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹21ని౹౹ వరకు 


గురుబోధ:

 
కార్తికపూర్ణిమ నాడు ప్రతి ఆలయం ముందు  జ్వాలాతోరణ (జ్వాలను తోరణం గా కట్టడం) ఉత్సవం జరపడం సంప్రదాయం.  రెండు కఱ్ఱ స్తంభములు నిలువుగా పాతి, అడ్డంగా మరొక కఱ్ఱని కట్టి దానికి గడ్డిచుట్టి, నెయ్యి వేసి, నిప్పు పెడతారు. ఆలయ ఉత్సవమూర్తులతో పాటు తోరణం మధ్యలో నడుస్తారు. జ్వాలాతోరణం లో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందని,  ఆరోగ్యం బాగుంటుందని, అగ్నిబాధలు ఉండవని, పునర్జన్మ ఉండదని, అప్పటివరకు చేసిన పాపాలు తొలగి, కోరికలు నెరవేరుతాయని శాస్త్రం.
expand_less