"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 15 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము తిథి: ఏకాదశి ఉదయం 08గం౹౹38ని౹౹ వరకు తదుపరి ద్వాదశి రేపు ఉదయం 09గం౹౹00ని౹౹ వరకు వారం : ఇందువారము (సోమవారం) నక్షత్రం: ఉత్తరాభాద్ర ఈ రోజు రాత్రి 08గం౹౹22ని౹౹ వరకు తదుపరి రేవతి యోగం: వజ్ర ఈ రోజు పూర్తిగా ఉండి కరణం : విష్టి ఈ రోజు ఉదయం 06గం౹౹39ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹23ని౹౹ నుండి 03గం౹౹09ని౹౹ వరకు వర్జ్యం: ఉదయం 05గం౹౹50ని౹౹ నుండి 07గం౹౹10ని౹౹ వరకు అమృతకాలం మధ్యాహ్నం 03గం౹౹25ని౹౹ నుండి 05గం౹౹03ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹07ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹24ని౹౹ వరకు 👉🏻🕉️ఏకాదశి🕉️ ఏకాదశీ ఉపవాసం సోమవారం ఉండాలి, ఉపవాసం ఉన్నవారు ద్వాదశి పారణ(భోజన ప్రసాదం) రేపు ఉదయం 09గం౹౹00౹౹ని లోపు చేయవలెను. గురుబోధ: నక్త వ్రతము అనగా పగలు ఉపవాసం ఉండి రాత్రి నక్షత్ర దర్శనం అయ్యాక భోజనం స్వీకరించడం. ఇలాంటి వ్రతములు ఆచరించేవారు ఏకాదశీ ఉపవాసం వంటివిచేయకపోయినా దోషము లేదు.నక్తవ్రతం ప్రకారంగా రాత్రి యథాతథంగా భోజనం స్వీకరించవచ్చు.