November 09 2021నవంబర్ 09 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 09 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   కార్తికమాసం శుక్లపక్షము

 తిథి: పంచమి మధ్యాహ్నం 03గం౹౹57ని౹౹ వరకు తదుపరి షష్ఠి
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం:  పూర్వాషాఢ ఈ రోజు రాత్రి 10గం౹౹47ని౹౹ వరకు తదుపరి  ఉత్తరాషాఢ
యోగం: ధృతి   ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹07ని౹౹ వరకు తదుపరి  శూల
కరణం  :  బాలవ  ఈ రోజు ఉదయం 10గం౹౹35ని౹౹ వరకు తదుపరి కౌలవ
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం
03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 08గం౹౹15ని౹౹ నుండి 09గం౹౹05ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹27ని౹౹ నుండి 11గం౹౹17ని౹౹ వరకు
వర్జ్యం: ఉదయం
09గం౹౹18ని౹౹ నుండి 10గం౹౹47ని౹౹ వరకు 
అమృతకాలం సాయంత్రం 06గం౹౹18ని౹౹ నుండి 07గం౹౹47ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹04ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹27ని౹౹ వరకు 

👉🏻🕉️నాగపంచమి 🕉️

గురుబోధ:
శ్రీ మద్ధేవి భాగవతము-  నవమ స్కంధం లో ఉన్న ఈ ద్వాదశ నామమంత్రములను నిత్యం లేదా పర్వదినములలో పఠిస్తే  నాగదోషాలు నశిస్తాయి. వంశంలో చేసిన భయంకర నాగాపచారాలు  కూడా తొలగిపోతాయని ఫలశ్రుతి.
◆ నాగదేవతా నామములు 
1. ఓం జరత్కారు ప్రియాయై నమః 
2. ఓం జగత్గౌర్యై నమః
3. ఓం సిద్ధయోగిన్యై నమః
4. ఓం నాగభగిన్యై నమః
5. ఓం నాగేశ్వర్యై నమః
6. ఓం విషహరాయై నమః
7. ఓం జగత్కారవే నమః
8. ఓం మనసాయై నమః 
9. ఓం వైష్ణవ్యై నమః
10.ఓం శైవ్యై నమః
11. ఓం ఆస్తీకమాత్రే నమః
12. ఓం మహాజ్ఞానయుతాయై నమః
expand_less