November 04 2021నవంబర్ 04 2021favorite_border

"కాలం - అనుకూలం" 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
  తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟  నవంబర్ 04 2021🌟
     _శ్రీ ప్లవనామ సంవత్సరం_
   దక్షిణాయనం   శరదృతువు 
   ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము

 తిథి: అమావాస్య తెల్లవారు 03గం౹౹30ని౹౹ వరకు తదుపరి పాడ్యమి
వారం : బృహస్పతివారం (గురువారం)
నక్షత్రం:  చిత్త ఈ రోజు ఉదయం 08గం౹౹07ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం: ప్రీతి   ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹11ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం  :  చతుష్పాద  ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹33ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న
రాహుకాలం  :  ఈ రోజు మధ్యాహ్నం
01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం: ఈ
 రోజు ఉదయం 09గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹37ని౹౹ వరకు
మధ్యాహ్నం
 02గం౹౹26ని౹౹ నుండి 03గం౹౹12ని౹౹ వరకు
వర్జ్యం: మధ్యాహ్నం 
01గం౹౹25ని౹౹ నుండి 02గం౹౹55ని౹౹ వరకు 
అమృతకాలం రాత్రి 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹04ని 
సూర్యాస్తమయం :  సాయంత్రం 05గం౹౹29ని౹౹ వరకు 

🕉️దీపావళీ అమావాస్య, పద్మకయోగం, లక్ష్మీదేవి పూజ  🕉️

గురుబోధ:

పండుగలు  ఇంటిలో జరపకపోవడం వల్ల దేవతల అనుగ్రహం పొందలేము. 
 పండుగలు, పర్వదినములు వచ్చినప్పుడు తప్పక ఇంటిలో యథాశక్తి  పూజ చేయాలి. ప్రత్యేక నైవేద్యాలు నివేదించాలి.   పండుగ వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలి. పిల్లలకి చెప్పాలి.  సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఆ రోజు చేసే పూజ, జపతప లేదా ఇతర పుణ్యకార్యములు వేలరెట్ల ఫలితం ఇస్తుంది. ఉదా౹౹ దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించడం, అర్చించడం వంటివి చేయడం వల్ల అమ్మవారు సులభంగా అనుగ్రహిస్తుంది.
expand_less