"కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి(15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది(27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 04 2021🌟 _శ్రీ ప్లవనామ సంవత్సరం_ దక్షిణాయనం శరదృతువు ఆశ్వయుజ మాసం కృష్ణపక్షము తిథి: అమావాస్య తెల్లవారు 03గం౹౹30ని౹౹ వరకు తదుపరి పాడ్యమి వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం: చిత్త ఈ రోజు ఉదయం 08గం౹౹07ని౹౹ వరకు తదుపరి స్వాతి యోగం: ప్రీతి ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹11ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్ కరణం : చతుష్పాద ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹33ని౹౹ వరకు తదుపరి కింస్తుఘ్న రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం: ఈ రోజు ఉదయం 09గం౹౹51ని౹౹ నుండి 10గం౹౹37ని౹౹ వరకు మధ్యాహ్నం 02గం౹౹26ని౹౹ నుండి 03గం౹౹12ని౹౹ వరకు వర్జ్యం: మధ్యాహ్నం 01గం౹౹25ని౹౹ నుండి 02గం౹౹55ని౹౹ వరకు అమృతకాలం రాత్రి 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹04ని సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹29ని౹౹ వరకు 🕉️దీపావళీ అమావాస్య, పద్మకయోగం, లక్ష్మీదేవి పూజ 🕉️ గురుబోధ: పండుగలు ఇంటిలో జరపకపోవడం వల్ల దేవతల అనుగ్రహం పొందలేము. పండుగలు, పర్వదినములు వచ్చినప్పుడు తప్పక ఇంటిలో యథాశక్తి పూజ చేయాలి. ప్రత్యేక నైవేద్యాలు నివేదించాలి. పండుగ వైశిష్ట్యాన్ని తెలుసుకోవాలి. పిల్లలకి చెప్పాలి. సూర్యోదయానికి ముందే స్నానం చేయాలి. ఆ రోజు చేసే పూజ, జపతప లేదా ఇతర పుణ్యకార్యములు వేలరెట్ల ఫలితం ఇస్తుంది. ఉదా౹౹ దీపావళి నాడు లక్ష్మీదేవిని పూజించడం, అర్చించడం వంటివి చేయడం వల్ల అమ్మవారు సులభంగా అనుగ్రహిస్తుంది.