కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 30 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం
తిథి: చతుర్దశి ఉ. 9.35 కు తదుపరి అమావాస్య 1 ఉ. 11.01 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: విశాఖ మ. 12.34 కు తదుపరి అనూరాధ 1 మ. 2.26 కు
యోగం: అతిగండ సా. 04.45 కు తదుపరి సుకర్మ 1 సా. 04.34 కు
కరణం: శకుని ఉ. 10.29 కు తదుపరి చతుష్పాద రా. 11.14 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 06.30 - 07.59 కు
వర్జ్యం: సా. 4.52 - 6.36 కు
అమృతకాలం: తె. 3.14 - 4.57 కు
సూర్యోదయం: ఉ. 6.30 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు
గురుబోధ:
రుద్రాక్షలతో ఈశ్వరుణ్ణి అర్చించి ఆ తర్వాత అందులో ఒక రుద్రాక్షని మీ మెడలో వేసుకోండి. శరీరం మీద రుద్రాక్ష ఎప్పుడూ ఉండచ్చు సర్వకాల సర్వావస్థ లలో ఉండవచ్చు. రుద్రాక్ష శరీరం లో ఒక అవయవం రుద్రాక్ష శరీరం మీద ఉండగా శరీరం విడిచిపెడితే నరకానికి పోరు. "రుద్రాక్ష ధారణా దేవ రుద్రో భవత్య సంశయః" రుద్రాక్ష ధరించడం వల్ల రుద్రుడయి తీరుతాడు.