Nov 30 2023నవంబరు 30 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 30 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము

తిథి : తదియ  మ. 02గం౹౹06ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : ఆరుద్ర మ. 03గం౹౹32ని౹౹ వరకు తదుపరి పునర్వసు
యోగం : శుభ రా. 08గం౹౹15ని౹౹ వరకు తదుపరి శుక్ల
కరణం :  విష్టి మ. 02గం౹౹24ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹57ని౹౹ నుండి 10గం౹౹41ని౹౹ వరకు & మ. 02గం౹౹24ని౹౹ నుండి 03గం౹౹08ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹19ని౹౹ నుండి 06గం౹౹01ని౹౹ వరకు
అమృతకాలం : తె. 05గం౹౹15ని౹౹ నుండి ఉ. 06గం౹౹45ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹16ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹కు

🕉️ సంకటహర చతుర్థి🕉️

గురుబోధ
గణేశుని అనుగ్రహం కోసం ప్రతిమాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థి వ్రతం ఆచరిస్తారు. విభూతి ధరించినవాడిని అవహేళన చేసేవాడు మహాపాపి అవుతాడు. అటువంటివారు శరీరం విడిచిపెట్టాక నరకం పాలై, ఆ తరువాత, పందిగా, రాక్షసుడిగా, గాడిదగా, కుక్కగా, నక్కగా, పురుగుగా పుట్టి అనేక బాధలనుభవిస్తారు. భస్మం ధరించినవారిని నిందించేవారు మందబుద్ధులు. శివధనాపహరణం, శివనింద చేయడం అనబడే ఈ రెండు పాపాలకూ మాత్రం ప్రాయశ్చితం లేదు. విభూతిని మూడు రేఖలుగా ధరించేవాడు మరణించిన వారిని వేయితరాలవారిని, రాబోయే వేయితరాలవారిని ఉద్ధరిస్తాడు. త్రిపుండ్ర భస్మధారణ చేసిన వాడు దీర్ఘాయువు పొందుతాడు. వ్యాధులనుండి విముక్తిని పొందుతాడు. భోగాలనుభవిస్తాడు. చివరిలో సుఖమరణం పొందుతాడు. శరీరం విడిచిపెట్టాక దివ్య శరీరం ధరించి, అనేక విధాలుగా సద్గతులు పొందుతాడు. విభూతిని నిందించేవాడు బ్రహ్మాయుర్ధాయం ఉన్నంతకాలం నరకం పొందుతాడు. కాబట్టి ఏ పరిస్థితులలోనూ భస్మనింద మాత్రం చేయరాదు.

గణేశ భుజంగ స్తోత్రం👇


శ్రీ గణేశ పంచరత్నమాలా స్తోత్రం👇


expand_less