" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 30 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్షమాసం శుక్లపక్షము తిథి : సప్తమి మధ్యాహ్నం 01గం౹౹36ని౹౹ వరకు తదుపరి అష్టమి వారం : సౌమ్యవారం (బుధవారం) నక్షత్రం : ధనిష్ఠ ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹13ని౹౹ వరకు తదుపరి శతభిషం యోగం : వ్యాఘాత మధ్యాహ్నం 12గం౹౹02ని౹౹ వరకు తదుపరి హర్షణ కరణం : వణిజ ఈ రోజు ఉదయం 08గం౹౹58ని౹౹ వరకు తదుపరి విష్టి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 11గం౹౹26ని౹౹ నుండి 12గం౹౹10ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 07గం౹౹01ని౹౹ నుండి 08గం౹౹31ని౹౹ వరకు అమృతకాలం : తె. 04గం౹౹05ని౹౹ నుండి 05గం౹౹35ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹16ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ గురుబోధ భూతపిశాచ బాధలు, చెడు ప్రయోగాల నుండి బయటపడడానికి శ్రీ హనుమాన్ చాలీసా పారాయణం చేయాలి. హనుమాన్ చాలీసా పారాయణం చేయడం వలన చెడు ప్రయోగాలు దరిచేరవు, సకల శుభాలు ప్రాప్ర్తిస్తాయి. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.