" కాలం - అనుకూలం" ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 29 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుక్లపక్షము తిథి : షష్ఠి మధ్యాహ్నం 03గం౹౹48ని౹౹ వరకు తదుపరి సప్తమి వారం : భౌమవారం (మంగళవారం) నక్షత్రం : శ్రవణం ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹45ని౹౹ వరకు తదుపరి ధనిష్ఠ యోగం : ధృవ మధ్యాహ్నం 02గం౹౹53ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత కరణం : తైతుల ఈ రోజు ఉదయం 11గం౹౹04ని౹౹ వరకు తదుపరి గరజి రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 08గం౹౹20ని౹౹ నుండి 09గం౹౹11ని౹౹ వరకు & రాత్రి 10గం౹౹29ని౹౹ నుండి 11గం౹౹20ని౹౹ వరకు వర్జ్యం : సాయంత్రం 05గం౹౹29ని౹౹ నుండి 06గం౹౹59ని౹౹ వరకు అమృతకాలం : రాత్రి 02గం౹౹28ని౹౹ నుండి 03గం౹౹58ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹16ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ 👉🏻🕉️సుబ్రహ్మణ్య షష్ఠి🕉️ గురుబోధ ఆలయములు తుడిచినవారు జీవితంలో దారిద్ర్యం పొందరు. ధర్మరాజు వంటి మహానుభావులు సైతం చేసిన అద్భుతమైన సేవ ఆలయసేవ. అటువంటి సేవలో పాల్గొనడం సకలపుణ్యప్రదం, సమస్తశుభదాయకం. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.