కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 28 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం
తిథి: త్రయోదశి 29 ఉ. 7.48 కు తదుపరి చతుర్దశి 30 ఉ. 9.35 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: చిత్త ఉ. 7.50 కు తదుపరి స్వాతి 29 ఉ. 10.20 కు
యోగం: సౌభాగ్య సా. 04.02 కు తదుపరి శోభన 29 సా. 04.34 కు
కరణం: గరజి సా. 07.34 కు తదుపరి వణిజ పూర్తి
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.12 - 10.57 కు & మ. 02.41 - 03.26 కు
వర్జ్యం: మ. 2.00 - 3.46 కు
అమృతకాలం: రా. 12.34 - 2.20 కు
సూర్యోదయం: ఉ. 6.29 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు
🕉️ ప్రదోషం, త్రయోదశి నందీశ్వర అభిషేకం 🕉️
గురుబోధ:
ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయ, సూర్యాస్తమయ కాలాలను ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. రాత్రి లేక ప్రదోషంతో కూడిన చతుర్దశి, చతుర్దశి తరువాత తిథి (పూర్ణిమ లేక అమావాస్య) శివదర్శనమునకు శ్రేష్ఠకాలములు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం శివాశివుల ఐక్యరూపం. చెట్లు, తీగలు మొదలైన వాటిని స్థావరలింగాలు అంటారు. వీటికి నీరు పోసి పోషిస్తే శివుని స్థావరలింగపూజగా శివుడు భావిస్తాడు. కాబట్టి శివభక్తులు వీటిని పోషించాలి. పక్షులు, జంతువులు జంగమాలు అనబడతాయి. వీటిని రక్షించి పోషిస్తే శివుని జంగమలింగపూజ అవుతుంది. కాబట్టి వీటిని కూడా పోషించి రక్షించాలి. ఈ మొత్తం పూజను ప్రకృతిపూజగా అనగా అమ్మవారి పూజగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇది నిజమైన శివపూజ. శివాలయం తుడిచినవాడు, కడిగి శుభ్రం చేసినవాడు, శివుడి కోసం పూలతోట పెంచి, అందులోని పూలను శివునకు అర్పించినవాడు శివపదం పొందుతాడు. బ్రతికినంతకాలం సంపదలు పొందుతాడు.