"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 28 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము
తిథి : పాడ్యమి మ. 01గం౹౹37ని౹౹ వరకు తదుపరి విదియ
వారం : భౌమవారము (మంగళవారం)
నక్షత్రం : రోహిణి మ. 01గం౹౹53ని౹౹ వరకు తదుపరి మృగశిర
యోగం : సాధ్య రా. 08గం౹౹55ని౹౹ వరకు తదుపరి శుభ
కరణం : గరజి మ. 01గం౹౹56ని౹౹ వరకు తదుపరి వణిజ
రాహుకాలం : మ. 03గం౹౹00ని౹౹ నుండి 04గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹19ని౹౹ నుండి 09గం౹౹11ని౹౹ వరకు & రా. 10గం౹౹28ని౹౹ నుండి 11గం౹౹20ని౹౹ వరకు
వర్జ్యం : తె. 05గం౹౹51ని౹౹ నుండి 07గం౹౹27ని౹౹ వరకు & రా. 07గం౹౹37ని౹౹ నుండి 09గం౹౹15ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 10గం౹౹40ని౹౹ నుండి 12గం౹౹16ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹14ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹కు
గురుబోధ
మారేడుచెట్టు శివుని స్వరూపమే. శివునికీ, బిల్వవృక్షానికీ తేడా లేదు. అందుకే దేవతలు కూడా ఈ చెట్టును అతి భక్తితో స్తుతిస్తారు. ఈ చరాచర జగత్తులో ప్రసిద్ధికెక్కిన ఎన్ని పుణ్యతీర్థాలున్నాయో అవన్నీ మారేడుచెట్టు మూలంలో (వ్రేళ్ళలో) ఉంటాయి. మారేడుచెట్టు మూలంలో లింగం ఒకదానిని కాని లేదా అనేక లింగాలను కాని ఉంచి పూజించినవాడు పరమ పుణ్యాత్ముడౌతాడు. శివుని సన్నిథిని పొందగలుగుతాడు. మారేడుచెట్టు క్రింద స్నానం చేసినవాడు, సమస్త పుణ్యతీర్థాలలో స్నానం చేసిన మహాఫలం పొంది, పవిత్రుడౌతాడు. గంధపుష్పాదులతో మారేడుచెట్టు మొదలును పూజించినవాడు శివలోకంలో శాశ్వతంగా ఉండగలుగుతాడు. మారేడుచెట్టు దగ్గర దీపం వెలిగించిన పుణ్యాత్ముడు, తత్త్వజ్ఞానం పొందుతాడు. శరీరం విడిచిపెట్టాక శివుడిలో ఐక్యం అవుతాడు. అందునా, కార్తికమాసంలోనూ, మాఘమాసంలోనూ, ప్రతి మాసశివరాత్రికీ, మారేడు దగ్గర ఆవునేతిదీపం వెలిగించిన వాడికి ఈ జన్మలోనే కైవల్యం లభిస్తుంది.
శివలింగ పూజా విధానములు👇
శివలింగ పూజా ఫలితాలు👇