Nov 27 2025నవంబరు 27 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 27 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: సప్తమి రా.9.15 కు తదుపరి అష్టమి 28 రా.8.37 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: ధనిష్ఠ రా.10.27 కు తదుపరి శతభిషం 28 రా.10.25 కు
యోగం: ధ్రువ సా.12:09 కు తదుపరి వ్యాఘాత 28 ఉ.11:05 కు
కరణం: గరజి మ.12.21 కు తదుపరి వణిజ రా. 12:30 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ.10:13-10:57 కు, మ. 2:38-3:22 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ.3.42-సా.5.22 కు
సూర్యోదయం: ఉ. 6.15 కు
సూర్యాస్తమయం: సా. 5:20 కు

🕉️ నందాసప్తమి 🕉️

గురుబోధ:
కఠినంగా మాట్లాడడము, పెద్దలను అగౌరవ పరచడం, ఇతరుల చేసిన తప్పులు పదేపదే చెప్పడం, అసత్యం పలకడం వంటివి చేయడం వల్ల మనం చేసిన పుణ్యము క్షీణిస్తుంది.
సదాచారాలు పాటించేవారికి సకలశుభాలు దేవతలు ప్రసాదిస్తారు. ఆచారాలు పాటించకుండా ఎన్ని పూజలు, జపములు చేసినా దేవతలు అనుగ్రహించరు.

expand_less