కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 27 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం
తిథి: ద్వాదశి 28 తె. 5.41 కు తదుపరి త్రయోదశి 28 పూర్తి
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: చిత్త 28 ఉ. 7.50 కు తదుపరి స్వాతి 29 ఉ. 10.20 కు
యోగం: ఆయుష్మాన్ మ. 3.13 కు తదుపరి సౌభాగ్య 28 సా. 4.02 కు
కరణం: కౌలవ సా. 5.07 కు తదుపరి తైతుల 28 ఉ. 6.23 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ. 11.41 - 12.26 కు
వర్జ్యం: మ. 2.04 - 3.50 కు
అమృతకాలం: రా. 12.39 - 2.25 కు
సూర్యోదయం: ఉ. 6.28 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు
ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈరోజు ఉదయం చేయాలి.
గురుబోధ:
సంపూర్ణ సంకల్ప సహిత కార్తికస్నానం ప్రతిరోజూ చేయాలి. కుంకుమ లేదా భస్మధారణ చేయాలి. శివకేశవులకు అభేదం అని గుర్తించాలి. ప్రతిరోజూ సంకల్పసహిత కార్తిక స్నానం నామము ధరించటం, కార్తిక దీపం వెలిగించటం, ఆకాశ దీపం దర్శనం చేయటం, గురువులను, దైవాన్ని దర్శనం చేసుకోవటం, ప్రదక్షిణలు చేయటం, శక్తి మేర స్వయంపాకం దానం ఇవ్వటం ఉత్తమం.