Nov 27 2022నవంబర్ 27 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 27 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు  
మార్గశీర్ష మాసం శుక్లపక్షము 

తిథి : చతుర్థి రాత్రి 08గం౹౹30ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భానువారం  (ఆదివారం)  
నక్షత్రం : పూర్వాషాఢ ఈ రోజు సాయంత్రం 05గం౹౹04ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ 
యోగం :   గండ రాత్రి 09గం౹౹34ని౹౹ వరకు తదుపరి వృద్ధి 
కరణం :   విష్టి ఈ రోజు సాయంత్రం 04గం౹౹25ని౹౹ వరకు తదుపరి బవ 
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 03గం౹౹52ని౹౹ నుండి 04గం౹౹37ని౹౹ వరకు
వర్జ్యం : రాత్రి 12గం౹౹30ని౹౹ నుండి 01గం౹౹59ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹34ని౹౹ నుండి మ. 02గం౹౹04ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹14ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ 



గురుబోధ

ఎంగిలి నోటితో గురువుతో మాట్లాడరాదు. ఎంగిలి చేత్తో ఏ పదార్థాన్ని చూపించరాదు.



పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.

expand_less