Nov 26 2025నవంబరు 26 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 26 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: షష్ఠి రా.9.25 కు తదుపరి సప్తమి 27 రా.9.15 కు
వారం: సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం: శ్రవణం రా.10.03 కు తదుపరి ధనిష్ఠ 27 రా.10.27 కు
యోగం: వృద్ధి సా.12:42 కు తదుపరి ధ్రువ సా.12:09 కు
కరణం: కౌలవ ఉ. 11:34 కు తదుపరి తైతుల రా. 12:02 కు
రాహుకాలం: మ. 12.00 - 01.30 కు
దుర్ముహూర్తం: ఉ.11:41-12:25 కు
వర్జ్యం: రా.2.06-3.42 కు
అమృతకాలం: మ.2.27-4.09 కు
సూర్యోదయం: ఉ. 6.16 కు
సూర్యాస్తమయం: సా. 5:20 కు

🕉️ స్కందషష్ఠి, సుబ్రహ్మణ్యషష్ఠి 🕉️

గురుబోధ:
స్కందోత్పత్తి ఘట్టము, కుమారస్వామి చరిత్ర, తారకాసురవధ వినడం వలన సకలపాపాలు తొలగి, సమస్తశుభాలు ప్రాప్తించి, భోగభాగ్యాలు, ముక్తి లభిస్తుంది. తారకాసురుడిని, ప్రలంబాసురుడిని మొదలైన అసురుల్ని సంహరించిన కారణజన్ముడైన శివపార్వతీ తనయుడు, కుమారస్వామి గాధ విన్నవారు తప్పక మోక్షం పొంది తీరుతారు. శివుడు తన పుత్రుడైన కార్తికేయుని పూజిస్తే ఎంతో సంతోషించి సర్వమంగళములను ప్రసాదిస్తాడు.
https://youtu.be/HzagOETvUGw

expand_less