కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 26 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం
తిథి: ఏకాదశి 27 తె. 3.31 కు తదుపరి ద్వాదశి 28 తె. 5.41 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: హస్త 27 తె. 5.11 కు తదుపరి చిత్త 27 పూర్తి
యోగం: ప్రీతి మ. 02.14 కు తదుపరి ఆయుష్మాన్ 27 మ. 03.13 కు
కరణం: బవ మ. 02.25 కు తదుపరి బాలవ రా. 03.47 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.42 - 09.27 కు & రా. 10.47 - 11.38 కు
వర్జ్యం: ఉ. 11.56 - 1.42 కు
అమృతకాలం: రా. 10.31 - 12.17 కు
సూర్యోదయం: ఉ. 6.27 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు
🕉️ కార్తిక కృష్ణ ఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ రేపు ఉదయం చేయాలి.
శ్రీ వాసుదేవ శతనామాలు👇
https://youtu.be/DpjBm71jA_s
గురుబోధ:
ఏకాదశి అంటే హరిహరులకి ప్రీతి. ఏకాదశి అనే మాట వింటేనే యమకింకరులు వణికిపోతారు. అది కూడా కార్తికమాసంలో వచ్చే రెండు ఏకాదశుల్లో తెల్లవారుజామున లేచి నదుల్లో కానీ, కాలువల్లో కానీ, ఎక్కడైనా స్నానం చేసి విష్ణు ఆలయం, లేక శివాలయంకి వెళ్లి యథాశక్తి అర్చన చెయ్యాలి. తులసీదళాలతో హరిని, బిల్వదళాల తో హరుడిని అర్చన చేసి ఉపవాసం ఉండి రాత్రికి నక్తభోజనం కానీ లేక సంపూర్ణ ఉపవాసం కానీ ఉండి భగవంతుని కథలు వింటూ భగవత్ ధ్యానం చేసిన వాడు జీవితంలో యమకింకరుల దర్శనం చేయడు. నరకానికి వెళ్ళడు. సకల శుభాలు పొందుతాడు. ఏకాదశి నాడు ఒక వెయ్యి ఎనిమిది తులసీ దళాలు, బిల్వపత్రాలతో శివుడ్ని పూజించిన వాడు ఐశ్వర్యం పొందుతాడు. చామంతి పువ్వులు, తులసీదళాలతో విష్ణువును పూజించిన వాడు మంచి పదవి పొందుతాడు. ఏకాదశి రోజున జాగరణ చేసి మరుసటి రోజు హరి దర్శనం చేసుకున్నవాడికి జీవితంలో సుఖం, శాంతి, ఆనందం తప్ప మాటవరసకి కూడా దౌర్భాగ్యం పొందడు.