Nov 26 2023నవంబరు 26 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 26 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము

తిథి : చతుర్దశి  మ. 03గం౹౹08ని౹౹ వరకు తదుపరి పూర్ణిమ
వారం : భానువారము (ఆదివారం)
నక్షత్రం : భరణి మ. 02గం౹౹10ని౹౹ వరకు తదుపరి కృత్తిక
యోగం : పరిఘ రా. 01గం౹౹37ని౹౹ వరకు తదుపరి శివ
కరణం :  వణిజ మ. 03గం౹౹53ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : సా. 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : సా. 03గం౹౹52ని౹౹ నుండి 04గం౹౹36ని౹౹ వరకు
వర్జ్యం : రా. 01గం౹౹59ని౹౹ నుండి 03గం౹౹33ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 09గం౹౹31ని౹౹ నుండి 11గం౹౹04ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹13ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹కు

🕉️ కార్తిక పూర్ణిమ, జ్వాలాతోరణం🕉️

గురుబోధ
🕉️జీవితంలో ఒక్కసారైనా జ్వాలాతోరణం దాటాలి అని వేదవాక్కు. బిల్వములతో ఈశ్వరునికి చేసే పూజాఫలం ఇంత అని చెప్పలేనిది.
🕉️శివకేశవులు భూమికి దగ్గరగా ఉండి దీవించే మాసం ఇది. కార్తికస్నానం, జపములు, దానాలు ప్రతిరోజూ చేయాలి.
🕉️కార్తికపూర్ణిమ నాడు ప్రతి ఆలయం ముందు జ్వాలాతోరణ (జ్వాలను తోరణంగా కట్టడం) ఉత్సవం జరపడం సంప్రదాయం. రెండు కఱ్ఱ స్తంభములు నిలువుగా పాతి, అడ్డంగా మరొక కఱ్ఱని కట్టి, దానికి గడ్డిచుట్టి, నెయ్యి వేసి, నిప్పు పెడతారు. ఆలయ ఉత్సవమూర్తులతో పాటు తోరణం మధ్యలో నడుస్తారు. జ్వాలాతోరణంలో పాల్గొంటే ఆయుష్షు పెరుగుతుందని,  ఆరోగ్యం బాగుంటుందని, అగ్నిబాధలు ఉండవని, పునర్జన్మ ఉండదని, అప్పటివరకు చేసిన పాపాలు తొలగి, కోరికలు నెరవేరుతాయని శాస్త్రం.
🕉️ఎన్నో జన్మల సంస్కారం ఉంటే గాని  పరమపవిత్రమైన కార్తికపూర్ణిమను సద్వినియోగం చేసుకోవాలని ఆలోచన రాదు.  ముఖ్యంగా దీపం వెలిగించడం, దానం చేయడం, ఆలయ దర్శనం చేసుకోవడం, ప్రదక్షిణ, నదీస్నానం లేదా పురాణం వినడం వంటివి ఏవో ఒకటి తప్పక చేయాలి.

శివమానస పూజ👇


శ్రీ శివకేశవ అష్టోత్తరం👇


శ్రీ మార్కండేయ కృత ఆదిత్య స్తవము👇


కాశీ ఆవిర్భావం👇


expand_less