Nov 26 2022నవంబర్ 26 2022favorite_border

" కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 26 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం హేమంత ఋతువు  
మార్గశీర్ష మాసం శుక్లపక్షము 

తిథి : తదియ రాత్రి 10గం౹౹49ని౹౹ వరకు తదుపరి చతుర్థి
వారం : స్థిరవారం  (శనివారం)  
నక్షత్రం : మూల ఈ రోజు రాత్రి  06గం౹౹38ని౹౹ వరకు తదుపరి పూర్వాషాఢ 
యోగం :   శూల రాత్రి 01గం౹౹14ని౹౹ వరకు తదుపరి గండ 
కరణం :   తైతుల ఈ రోజు ఉదయం 09గం౹౹01ని౹౹ వరకు తదుపరి గరజి 
రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹11ని౹౹ నుండి 07గం౹౹41ని౹౹ వరకు
వర్జ్యం : సాయంత్రం 05గం౹౹08ని౹౹ నుండి 06గం౹౹27ని౹౹ వరకు & తెల్లవారి 03గం౹౹36ని౹౹ నుండి 05గం౹౹06ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹37ని౹౹ నుండి మ. 02గం౹౹07ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹13ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ 



గురుబోధ

మొక్కలు నాటడం, మొక్కలకు నీళ్లు పోయడం, మొక్కలను సంరక్షించడం ఎంతో పుణ్యప్రదం. వీటిని ముఖ్యంగా ఆలయాల్లో చేయడము వల్ల దేవతలు ప్రీతి చెందుతారు. అనేక శుభాలు కలిగిస్తారు.


పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది.

expand_less