కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 25 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం
తిథి: దశమి రా. 1.27 కు తదుపరి ఏకాదశి 26 తె. 3.31 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: ఉత్తర రా. 2.39 కు తదుపరి హస్త 26 తె. 5.11 కు
యోగం: విష్కంభ మ. 01.12 కు తదుపరి ప్రీతి 26 మ. 02.14 కు
కరణం: వణిజ ఉ. 11.39 కు తదుపరి విష్టి రా. 01.01 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.26 - 01.11 కు & మ. 02.40 - 03.25 కు
వర్జ్యం: ఉ. 8.14 - 9.59 కు
అమృతకాలం: రా. 6.40 - 8.25 కు
సూర్యోదయం: ఉ. 6.27 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు
🕉️ ఈ సంవత్సరంలో ఆఖరి కార్తిక సోమవారం 🕉️
గురుబోధ:
25వ రోజు గురుస్మరణ చేస్తూ నిద్రలేవాలి. సంకల్ప పూర్వకంగా కార్తిక స్నానం చేయాలి. ఎన్నో జన్మల తర్వాత మానవ జన్మ వస్తుంది, కాబట్టి దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఈ రోజు వనభోజనాలు చేయటం మంచిది. సాత్వికంగా ఉండే ఆహారం తినాలి. ఈ రోజు అంతా గురుస్మరణ చేయటం వల్ల నోటితో చెప్పలేని అనేక పాపాలు తొలగుతాయి.
శ్లో|| వందే గురుపద ద్వంద్వం అవాఙ్మానస గోచరం | రక్తశుక్లప్రభామిశ్రమ్ అతర్క్యం త్రైపురం మహః
ఈ శ్లోకం చెప్పుకోవడం ద్వారా ధ్యానం నిలుస్తుంది. తపస్సులు ఫలిస్తాయి. సూర్యాస్తమయం అయ్యాక చేసే దానం కి విశేష ఫలితం ఉంటుంది. స్వయంపాకం ఏ రోజు అయినా చేయవచ్చును. దీపదానం చేస్తే కంటి సమస్యలు తొలగుతాయి. దేవతలకు ప్రదక్షిణ చేయాలి. అంబరీషోపాఖ్యానం యొక్క మిగిలిన కథ వినాలి.