"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 25 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము
తిథి : త్రయోదశి సా. 04గం౹౹34ని౹౹ వరకు తదుపరి చతుర్దశి
వారం : స్థిరవారము (శనివారం)
నక్షత్రం : అశ్విని మ. 02గం౹౹57ని౹౹ వరకు తదుపరి భరణి
యోగం : వరీయాన్ తె. 03గం౹౹53ని౹౹ వరకు తదుపరి పరిఘ
కరణం : తైతుల సా. 05గం౹౹22ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : ఉ. 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 06గం౹౹13ని౹౹ నుండి 07గం౹౹41ని౹౹ వరకు వర్జ్యం : ఉ. 11గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹39ని౹౹ వరకు & రా . 12గం౹౹14ని౹౹ నుండి 01గం౹౹47ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 08గం౹౹04ని౹౹ నుండి 09గం౹౹35ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹13ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹కు
🕉️ కార్తిక శుద్ధ త్రయోదశి - శనిత్రయోదశి🕉️
గురుబోధ
⚡ శనివారం త్రయోదశి వస్తే దానిని శనిత్రయోదశి అంటారు. ఆ రోజు శనైశ్చరునికి, హనుమంతునికి లేదా గణపతికి చేసే పూజల వల్ల శని అనుగ్రహం పొంది కష్టాల నుండి త్వరగా బయట పడుతారు
⚡ శనైశ్చరుడు సాక్షాత్ సూర్యభగవానుని పుత్రుడు, కరుణా స్వరూపుడు. కాశీలో గొప్ప తపస్సు చేసి శివ అనుగ్రహంతో గ్రహాధిపతి అయ్యాడు. ధర్మప్రియుడు. అధర్మం చేసేవారిని శిక్షిస్తాడు.
⚡ నిత్యం నవగ్రహ ప్రదక్షిణ ఎంతో మంచిది. నవగ్రహాలనూ ఎప్పుడూ తక్కువ చేయరాదు. వారు గొప్ప తపస్సు చేసి గ్రహాధిపత్యం పొందారు. కేవలం శనికి తైలాభిషేకం చేస్తే తప్ప నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణ అయ్యాక కాళ్లు కడుక్కోవడం ఏ శాస్త్రం లో చెప్పలేదు.
⚡దేవాలయాల్లో మూర్తులకు ముఖ్యంగా శనైశ్చరునికి ఎదురుగా నిలబడరాదు. ప్రక్కనుండి మాత్రమే నమస్కారం చెయాలి.
⚡ సిందూరం లేదా తమలపాకులతో హనుమంతుని పూజించడం, శనికి నువ్వుల నూనెతో అభిషేకం, బెల్లం నువ్వులు నైవేద్యం పెట్టడం, నల్లని వస్త్రం ఇవ్వడం మరియు నిత్యం ఈ శ్లోక పారాయణ వల్ల శుభ ఫలితాలు పొందుతాం.
శ్లో|| కోణం నీలాంజన ప్రఖ్యం మంద చేష్టా ప్రసారిణం ఛాయా మార్తాండ సంభూతం, నమస్యామి శనైశ్చరంశనిప్రదోషం - శివ పూజా ఫలితం!
⚡ప్రదోష సమయంలో శివ దర్శనం, అభిషేకము చాలా విశేషం. సకల కోరికలు తీరుతాయి.
⚡శనిప్రదోష పూజా ఫలితంగా శ్రీ అనసూయ అత్రి మహర్షికి శ్రీ దత్తాత్రేయ స్వామి వారు; శ్రీ సుమతి, శ్రీ అప్పలరాజులకి శ్రీ పాద శ్రీ వల్లభులు జన్మించారు.
ఈ రోజు నవగ్రహాలకు 108 ప్రదక్షిణలు చేయడం మంచిది.
⚡ గాణగాపురం శ్రీ నృసింహ సరస్వతీ స్వామి వారు కూడా శనిప్రదోష పూజా ఫలితంగా వారి తల్లిదండ్రులకు జన్మించారు.
పిప్పలాద ప్రోక్త శని స్తోత్రం👇
శ్రీ శని స్తోత్రం (దశరథ కృతం)👇
ఏలినాటి శని తొలగించే కథ👇