Nov 24 2025నవంబరు 24 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 24 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: చతుర్థి రా.8.08 కు తదుపరి పంచమి 25 రా.9.01 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: పూర్వాషాఢ రా.7.40 కు తదుపరి ఉత్తరాషాఢ 25 రా.9.05 కు
యోగం: శూల సా.12:36 కు తదుపరి గండ 25 సా.12:49 కు
కరణం: వణిజ 24 ఉ. 8:26 కు తదుపరి విష్టి రా.8.22 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: 12:25-1:09 కు, మ. 2:38-3:22 కు
వర్జ్యం: తె.4.08-5.50 కు
అమృతకాలం: సా.4.36-6.22 కు
సూర్యోదయం: ఉ. 6:12 కు
సూర్యాస్తమయం: సా. 5:20 కు

గురుబోధ:
ఏ దేవాలయానికైనా దానం చేసినవారు ఆ ఆలయ నిర్మాణానికి ఎన్ని ఇసుక రేణువులు ఉపయోగించబడ్డాయో అన్ని దివ్యసంవత్సరములు సాక్షాత్ శ్రీ సత్యనారాయణ స్వామివారి దివ్యసన్నిధానమైన వైకుంఠంలో ఉంటారు. ఆలయనిర్మాణం జరుగుతున్న ప్రదేశానికి వెళ్ళి దానం చేయలేకపోయినా, తన ఇంట్లో నుండే ఈ దానం చేసినవారు చతుర్గుణం, అనగా నాలుగురెట్లు ఎక్కువ ఫలితాన్ని పొందుతారు.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less