Nov 24 2023నవంబరు 24 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 24 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము

తిథి : ద్వాదశి  రా. 06గం౹౹15ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : రేవతి సా. 04గం౹౹03ని౹౹ వరకు తదుపరి అశ్విని
యోగం : సిద్ధి ఉ. 09గం౹౹05ని౹౹ వరకు తదుపరి వ్యతీపాత
కరణం :  బవ ఉ. 08గం౹౹03ని౹౹ వరకు తదుపరి బాలవ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹26ని౹౹ నుండి 09గం౹౹10ని౹౹ వరకు & మ. 12గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు
వర్జ్యం : లేదు
అమృతకాలం : మ. 01గం౹౹46ని౹౹ నుండి 03గం౹౹17ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹12ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹కు

🕉️ కార్తిక శుద్ధ ద్వాదశి - క్షీరాబ్ధి ద్వాదశి, వ్యతీపాత యోగం🕉️

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ ఈ రోజు ఉదయం చేయాలి.

గురుబోధ
•	కార్తిక మాసంలో ఈ ఉత్థానద్వాదశి రోజున నిద్ర లేస్తాడు. ఈరోజు ఉదయం 4 గంటలకు లేదా ముందే లేచి కార్తిక స్నానం చేయడం మంచిది. ఇంట్లోనే స్నానం చేసే వారు ఆవుపాలు కొంచెం వేసి గంగాజలంతో స్నానం చేస్తున్న సంకల్పం చెప్పుకోవాలి.
ఈ రోజు చేసే గోదానం మరింత మంచిది. స్వయంపాకం ఒక్కరు లేదా ముగ్గురు లేదా ఐదుగురికి ఇవ్వడం మంచిది. గురువులకు పాదసేవ చేసినా, గురువు పాదాలు కడిగిన నీటిని నెత్తిన చల్లుకుంటే అది విష్ణుపాదోదకముతో సమానం.
•	ఆదివారం, శుక్రవారం, మంగళవారం తులసి ఆకులు కోయరాదు.
•	వ్యతీపాత యోగం వచ్చినప్పుడు గ్రహాల అనుగ్రహం కోసం కష్టాలు తీరడానికి  చనిపోయిన తల్లిదండ్రులని తలచుకొని తర్పణాలు ఇవ్వడం విశేష ఫలితం ఇస్తుంది.

తులసీ పూజావిధానం👇


తులసీచరిత్ర👇


expand_less