" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 24 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశీర్ష మాసం శుక్లపక్షము తిథి : పాడ్యమి రాత్రి 03గం౹౹00ని౹౹ వరకు తదుపరి విదియ వారం : బృహస్పతివారం (గురువారం) నక్షత్రం : అనూరాధ ఈ రోజు రాత్రి 09గం౹౹09ని౹౹ వరకు తదుపరి జ్యేష్ఠ యోగం : అతిగండ మధ్యాహ్నం 12గం౹౹20ని౹౹ వరకు తదుపరి సుకర్మ కరణం : కింస్తుఘ్న ఈ రోజు మధ్యాహ్నం 03గం౹౹04ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు మధ్యాహ్నం 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 09గం౹౹55ని౹౹ నుండి 10గం౹౹40ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹24ని౹౹ నుండి 03గం౹౹08ని౹౹ వరకు వర్జ్యం : రాత్రి 02గం౹౹38ని౹౹ నుండి 04గం౹౹09ని౹౹ వరకు అమృతకాలం : ఉదయం 11గం౹౹19ని౹౹ నుండి 02గం౹౹51ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹12ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹ గురుబోధ మానవ జీవితంలో ప్రతి ఒక్కరూ తమకోసము లేదా తమ ప్రీతిపాత్రులైన వారికోసం ఈ దశదానములు తప్పక చేయాలని శాస్త్రం. అన్నీ చేయలేకపోతే స్తోమత బట్టి వాటిలో కొన్ని అయినా చేయాలని శాస్త్రము. శ్లో౹౹ గోభూతిల హిరణ్యాజ్య వాసోధాన్య గుడాస్తథా రజతం లవణం చైవ దానాని దశవై విదుః ౹౹ -గరుడపురాణం(ధర్మకాండము) 1. గోవులు 2. భూమి 3. తిలలు 4. హిరణ్యం 5. ఘృతము 6. వస్త్రం 7. ధాన్యం 8. బెల్లం 9. వెండి 10. ఉప్పు పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది