కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 23 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం
తిథి: అష్టమి రా. 10.08 కు తదుపరి నవమి 24 రా. 11.37 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: మఘ రా. 10.21 కు తదుపరి పుబ్బ 24 రా. 12.20 కు
యోగం: ఐంద్ర ఉ. 11.42 కు తదుపరి వైధృతి 24 మ. 12.18 కు
కరణం: బాలవ తె. 06.57 కు తదుపరి కౌలవ సా. 07.56 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ. 06.26 - 07.55 కు
వర్జ్యం: ఉ. 9.34 - 11.16 కు
అమృతకాలం: రా. 7.40 - 9.22 కు
సూర్యోదయం: ఉ. 6.26 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు
శ్రీ సత్యసాయి బాబా వారి జయంతి
గురుబోధ:
అష్టమి శివునికి, అమ్మవారికి కూడా ప్రీతికరమైన తిథి. అనుమానం లేకుండా శివుడిని తులసీ దళములతో పూజించవచ్చు. ఇలా చేస్తే దారిద్య్రం తొలగుతుంది.
కొంతమందికి చిన్నప్పటి నుంచి జ్ఞాపకశక్తి ఉండదు. కొంతమందికి క్రమక్రమంగా వయస్సు పెరిగే కొద్దీ జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. ఇది భయంకరమైన లక్షణం. వార్ధక్యం వల్ల మతి పోయే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. అలాంటి వాళ్ళు శివలింగాన్ని పంచదార కలిపిన పాలతో అభిషేకించాలి. చెంబుడు పాలతో, బిందెడు పాలతో లేక పంచపాత్రలో పోసిన పాలతో పంచదార కలిపి సన్నని ధారతో అభిషేకించాలి. అభిషేకించగా వచ్చిన ధారను ఒక పాత్రలో పట్టుకుని పూజ అయిపోయాక తీర్ధంగా తీసుకుంటే అలాంటివాడికి మళ్ళీ మంచి తెలివితేటలు పెరుగుతాయి. మంచి జ్ఞాపకశక్తి పెరుగుతుంది. పూర్వం ఎంత చురుకైన బుద్ధి ఉన్నదో, ఎటువంటి జ్ఞాపకశక్తి ఉన్నదో ఆ జ్ఞాపకశక్తి తిరిగి వచ్చేస్తుంది.