"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 23 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము
తిథి : ఏకాదశి రా. 08గం౹౹16ని౹౹ వరకు తదుపరి ద్వాదశి
వారం : బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం : ఉత్తరాభాద్ర సా. 05గం౹౹20ని౹౹ వరకు తదుపరి రేవతి
యోగం : వజ్ర ఉ. 11గం౹౹54ని౹౹ వరకు తదుపరి సిద్ధి
కరణం : వణిజ ఉ. 10గం౹౹02ని౹౹ వరకు తదుపరి విష్టి
రాహుకాలం : మ. 01గం౹౹30ని౹౹ నుండి 03గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 09గం౹౹55ని౹౹ నుండి 10గం౹౹39ని౹౹ వరకు & మ. 02గం౹౹23ని౹౹ నుండి 03గం౹౹08ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹41ని౹౹ నుండి 06గం౹౹11ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹50ని౹౹ నుండి 02గం౹౹20ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹12ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹కు
🕉️ కార్తిక శుద్ధ ఏకాదశి - గురుఏకాదశి🕉️
ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ శుక్రవారం ఉదయం చేయాలి.
గురుబోధ
1. నక్త వ్రతము(రాత్రి నక్షత్ర దర్శనం అయ్యాక మాత్రమే భోజనం చేయడం) ఆచరించే నియమం పెట్టుకున్న వారు ఏకాదశి నియమం తో సంబంధం లేకుండా రాత్రి నక్షత్ర దర్శనము అయ్యాక పారణ(భోజనం) చేయవచ్చు.
2. నక్త వ్రత నియమం లేని వారు ఏకాదశీ ఉపవాసం ఉండి తర్వాత రోజు ద్వాదశి ఘడియల లో పారణము చేయవచ్చు.
3. నక్తము మరియు ఏకాదశి వ్రతములు రెండూ చేయువారు రాత్రి భోజనముకు బదులు ఫలహారం స్వీకరించవచ్చు.
ఏకాదశి అంటే హరిహరులకు ప్రీతి. ఏకాదశి అనే మాట వింటేనే యమకింకరులు వణికిపోతారు. అది కూడా కార్తికమాసంలో వచ్చే రెండు ఏకాదశుల్లో తెల్లవారుఝామున లేచి నదుల్లో కానీ, కాలువల్లో కానీ ఎక్కడైనా స్నానం చేసి విఘ్ణ ఆలయం లేదా శివాలయానికి వెళ్లి యథాశక్తి అర్చన చెయ్యాలి. తులసీదళాలతో హరిని, బిల్వదళాలతో హరుడిని అర్చన చేసి, ఉపవాసం ఉండి రాత్రికి నక్త భోజనం కానీ లేదా సంపూర్ణ ఉపవాసం కానీ ఉండి భగవంతుని కథలు వింటూ భగవత్ ధ్యానం చేసినవాడు జీవితంలో యమకింకరుల దర్శనము చేయడు. నరకానికి వెళ్ళడు. సకల శుభాలు పొందుతాడు. ఏకాదశి నాడు ఒక వెయ్యీ ఎనిమిది తులసీదళాలు, బిల్వపత్రాలతో శివుణ్ణి పూజించిన వాడు ఐశ్వర్యము పొందుతాడు. చామంతి పువ్వులు, తులసీదళాలతో విష్ణువును పూజించిన వాడు మంచి పదవిని పొందుతాడు.
శ్రీ వాసుదేవ శత నామాలు👇
నారదునికి కలిగిన విష్ణుమాయ👇
శివ ఉపదేశం👇