Nov 22 2025నవంబరు 22 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 22 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం

తిథి: విదియ సా.5.00 కు తదుపరి తదియ 23 సా.6.46 కు
వారం: స్థిరవారము (శనివారం)
నక్షత్రం: జ్యేష్ఠ మ.3.31 కు తదుపరి మూల 23 సా.5.46 కు
యోగం: సుకర్మ ఉ.11:29 కు తదుపరి ధృతి 23 సా.12:08 కు
కరణం: కౌలవ సా. 5:20 కు తదుపరి తైతుల ఉ.6:20 కు
రాహుకాలం: ఉ. 09.00 - 10.30 కు
దుర్ముహూర్తం: ఉ.7:57-8:42 కు
వర్జ్యం: రా.12.16-2.00 కు
అమృతకాలం: ఉ.6.56-8.43 కు
సూర్యోదయం: ఉ. 6:12 కు
సూర్యాస్తమయం: సా. 5:20 కు

గురుబోధ:
హేమంత ఋతువులో మెుదటి మాసం అయిన మార్గశీర్షంలో నందవ్రజమైన బృందావనంలోని కుమారీమణులు, నేతితో తయారుచేసిన దైవప్రసాదం ఆహారంగా స్వీకరిస్తూ, కృష్ణుడు తమ భర్త కావాలని కాత్యాయనీ వ్రతం చేసారు. ఈ వ్రతం చేసిన వారికి అభీష్టాలు నెరవేరతాయని శ్రీకృష్ణుడు గోపికలతో స్వయంగా చెప్పాడు. ఇంతటి మహావ్రతాన్ని మార్గశీర్షం మనకు అందించింది. గోపికలు ఈ వ్రతం చేసి శ్రీకృష్ణుడి అనుగ్రహం పొందారు.
శ్లో|| హేమంతే ప్రథమే మాసి, నందవ్రజ కుమారికాః |
చేరుర్హవిష్యం భుంజానాః కాత్యాయన్యర్చన వ్రతమ్ ||

expand_less