Nov 22 2023నవంబరు 22 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 22 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము

తిథి : దశమి  రా. 10గం౹౹28ని౹౹ వరకు తదుపరి ఏకాదశి
వారం : సౌమ్యవారము (బుధవారం)
నక్షత్రం : పూర్వాభాద్ర రా. 06గం౹౹53ని౹౹ వరకు తదుపరి ఉత్తరాభాద్ర
యోగం : హర్షణ మ. 02గం౹౹46ని౹౹ వరకు తదుపరి వజ్ర
కరణం :  తైతుల మ. 12గం౹౹06ని౹౹ వరకు తదుపరి గరజి
రాహుకాలం : మ. 12గం౹౹00ని౹౹ నుండి 01గం౹౹30ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 11గం౹౹23ని౹౹ నుండి 12గం౹౹08ని౹౹ వరకు
వర్జ్యం : తె. 03గం౹౹51ని౹౹ నుండి 05గం౹౹21ని౹౹ వరకు
అమృతకాలం : ఉ. 11గం౹౹26ని౹౹ నుండి 12గం౹౹55ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹12ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹20ని౹౹కు

🕉️ యాజ్ఞవల్క్య జయంతి🕉️

గురుబోధ
శివపురాణంలోని ఒక శ్లోకంకాని, లేదా సగం శ్లోకంకాని, భక్తితో చదివినవాడు ఆ క్షణమే పాపవిముక్తుడౌతాడు. నిత్యం ఎంతో కొంత చొప్పున ఈ శివపురాణం వినేవాడు జీవన్ముక్తుడనబడతాడు. చదువురానివాడు ఈ గ్రంథాన్ని రోజూ భక్తితో పూజించినా చాలు, అశ్వమేథయాగఫలం పొందుతాడు. కోరిన కోరికలు తీర్చే ఉత్తమగ్రంథం ఇది. శివపురాణానికి భక్తితో నమస్కరించినవానికి సర్వదేవతలను పూజించిన పుణ్యం లభిస్తుంది. శివపురాణం నిత్యం పఠించేవాడికి ఇంద్రాదులను కూడా ఆజ్ఞాపించే దివ్యశక్తి లభిస్తుంది. శివపురాణం నిత్యం పఠించేవాడు చేసే ప్రతిపుణ్యం కోటిరెట్లు ఫలితం ఇస్తుంది. శివపురాణంలోని రుద్రసంహిత, శ్రద్ధగా చదివితే బ్రహ్మహత్యాపాపం కూడా నశిస్తుంది.

శివకవచం👇


శ్రీ సరస్వతీమాత వైభవం - యాజ్ఞవల్క్య చరిత్ర👇


శ్రీ సరస్వతీకవచం👇


expand_less