కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 21 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసము శుక్ల పక్షం
తిథి: మార్గశిర శుద్ధ పాడ్యమి మ.2.55 కు తదుపరి విదియ 22 సా.5.00 కు
వారం: భృగువారము (శుక్రవారం)
నక్షత్రం: అనూరాధ మ.1.00 కు తదుపరి జ్యేష్ఠ 22 మ.3.31 కు
యోగం: అతిగండ ఉ.10:43 కు తదుపరి సుకర్మ 22 ఉ.11:29 కు
కరణం: బవ మ.2.47 కు తదుపరి బాలవ తె.4.00 కు
రాహుకాలం: ఉ. 10.30 - 12.00 కు
దుర్ముహూర్తం: ఉ.8:41-9:26 కు, మ. 12:24-1:08 కు
వర్జ్యం: రా.7.07-8.51 కు
అమృతకాలం: లేదు
సూర్యోదయం: ఉ. 6:24 కు
సూర్యాస్తమయం: సా. 5:40 కు
🕉️ పోలి స్వర్గం లేదా పోలి పాడ్యమి - దీపాలను అరటిదొన్నెలో విడవడం, మార్గశిరమాసం ఆరంభం 🕉️
గురుబోధ:
"మాసానాం మార్గశీర్షోహం" అని స్వయంగా శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో వివరించాడు. మార్గశీర్ష మాసం అత్యంత పవిత్రం అనీ, సంవత్సరానికి ఈ మాసం ఆభరణమనీ వాల్మీకి రామాయణం చెపుతున్నది. ఈ మాసంలో తామరపూలతో లక్ష్మీదేవిని పూజించిన వారికి మహానందాన్ని, సర్వసంపదలనూ ప్రసాదిస్తానని శ్రీమహాలక్ష్మి స్వయంగా అగస్త్యునితో చెప్పింది.