కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 21 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం
తిథి: షష్ఠి రా. 8.36 కు తదుపరి సప్తమి 22 రా. 9.07 కు
వారం: బృహస్పతివారము (గురువారం)
నక్షత్రం: పుష్యమి రా. 7.44 కు తదుపరి ఆశ్లేష 22 రా. 8.48 కు
యోగం: శుక్ల మ. 12.01 కు తదుపరి బ్రహ్మ 22 ఉ. 11.34 కు
కరణం: వణిజ సా. 05.03 కు తదుపరి విష్టి 22 తె. 05.29 కు
రాహుకాలం: మ. 01.30 - 03.00 కు
దుర్ముహూర్తం: ఉ. 10.10 - 10.55 కు & మ. 02.40 - 03.25 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: మ. 1.04 - 2.42 కు
సూర్యోదయం: ఉ. 6.24 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు
🕉️ గురుపుష్య యోగం 🕉️
గురుబోధ:
గురువారం నాడు పుష్యమీ నక్షత్రం కలిసివస్తే దానిని గురుపుష్యయోగంగా భావిస్తారు. ఈ రోజు లక్ష్మీనారాయణలను పూజిస్తే విశేష ధనయోగం లభిస్తుందని చెపుతారు. సకల కోరికలూ నెరవేరతాయి. అమావాస్యతో కలసివచ్చే సోమవారం శివుని పూజకు, శనివారంతో కలసివచ్చే త్రయోదశిని శనిదోషనివారణకు, మంగళవారంతో వచ్చే చతుర్థిని వినాయకుని పూజకు శ్రేష్ఠమైన తిథులుగా చెపుతుంటారు. అటువంటిదే ఈ గురుపుష్యయోగం కూడా. ఆరోజున గురువును పూజించడం, గోసేవ చేయడం గ్రహదోషాలు తొలగిపోతాయని పురాణాలు, జ్యోతిష్యశాస్త్రం చెపుతోంది.
ఈరోజు చేసే ఏ పనైనా అత్యంత శుభఫలితాలను, కాబట్టి ఎవరైనా కొత్త పనులు, కొత్త కార్యక్రమాలు చేయాలనుకుంటే ఈరోజు ప్రారంభిస్తే తప్పకుండా అది మంచి ఫలితాలను ఇస్తుంది ఇటువంటి యోగం చాలా అరుదుగా ఉంటుంది.