Nov 21 2022నవంబర్ 21 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 21 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తికమాసం కృష్ణపక్షము 

తిథి : ద్వాదశి ఈ రోజు ఉదయం 07గం౹౹24ని౹౹ వరకు తదుపరి త్రయోదశి
వారం : ఇందువారం  (సోమవారం)
నక్షత్రం : చిత్త ఈ రోజు రాత్రి 11గం౹౹12ని౹౹ వరకు తదుపరి స్వాతి
యోగం :   అయుష్మాన్   రాత్రి 09గం౹౹07ని౹౹ వరకు తదుపరి సౌభాగ్య
కరణం :   తైతుల ఈ రోజు ఉదయం 10గం౹౹07ని౹౹ వరకు  తదుపరి గరజి
రాహుకాలం : ఈ రోజు ఉదయం 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు మధ్యాహ్నం 12గం౹౹09ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు & మధ్యాహ్నం 02గం౹౹23ని౹౹ నుండి 03గం౹౹08ని౹౹ వరకు
వర్జ్యం :  ఉదయం 06గం౹౹47ని౹౹ నుండి 08గం౹౹24ని౹౹ వరకు & తెల్లవారి 04గం౹౹35ని౹౹ నుండి 06గం౹౹10ని౹౹ వరకు
అమృతకాలం : సాయంత్రం 04గం౹౹32ని౹౹ నుండి 06గం౹౹09ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹11ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹


ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ (భోజనం) ఈ రోజు ఉదయం 07గం౹౹24ని౹౹ లోపు చేయాలి.

ప్రదోష పూజ

గురుబోధ
శివుడికి ప్రీతిపాత్రమైన సోమవారం చాలా గొప్పది. అందులో కార్తిక సోమవారం శివుడు, ఏకాదశ రుద్రుడు అనే పేరుతో పదకొండు రుద్రరూపాలు ధరించి భూమిని రక్షించినటువంటి వారం. కార్తిక మాసంలో సోమవారం వచ్చినప్పుడు ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు రాహుకాలం ఉంటుంది.  ఆ కాలంలో శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసిన వాడు , శివుడి మీద నీళ్ళు చల్లినవాడు, శివుని ఆలయంలో తీర్థం స్వీకరించినటువంటి వాడు శ్రీశైల క్షేత్రంలో నూరు సంవత్సరాలు యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందుతాడు. కాశీలో 11 ఏళ్ళు యజ్ఞం చేసిన ఫలితాన్ని పొందుతాడు.  కాబట్టి కార్తికమాసంలో కనీసం సోమవారం నాడైనా ఆ పని చేయాలి.

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది

expand_less