Nov 20 2023నవంబరు 20 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 20 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము

తిథి : అష్టమి  రా. 07గం౹౹28ని౹౹ వరకు తదుపరి నవమి
వారం : ఇందువారము (సోమవారం)
నక్షత్రం : ధనిష్ఠ రా. 10గం౹౹15ని౹౹ వరకు తదుపరి శతభిషం
యోగం : ధ్రువ రా. 08గం౹౹35ని౹౹ వరకు తదుపరి వ్యాఘాత
కరణం :  విష్టి సా. 04గం౹౹19ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఉ. 07గం౹౹30ని౹౹ నుండి 09గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : మ. 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹53ని౹౹ వరకు & మ. 02గం౹౹23ని౹౹ నుండి 03గం౹౹08ని౹౹ వరకు
వర్జ్యం : తె. 04గం౹౹12ని౹౹ నుండి 05గం౹౹43ని౹౹ వరకు
అమృతకాలం : మ. 12గం౹౹32ని౹౹ నుండి 02గం౹౹02ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹10ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹21ని౹౹కు

🕉️ కార్తిక సోమవారం🕉️

గురుబోధ
అష్టమీతిథి శివునికి, అమ్మవారికి అత్యంత ప్రీతికరం. సోమవారంతో పాటు వచ్చిన అష్టమి మరింత విశేషఫలితాలనిస్తుంది.
తనకు తోచినప్పుడల్లా అనేక పార్ధివలింగాలని తయారుచేసుకుని, వీలున్నప్పుడల్లా అర్చన చేసేవాడు, అందులో ముఖ్యంగా సోమవారం కానీ, చతుర్దశి నాడు కానీ, మాస శివరాత్రి కానీ, అష్టమినాడు కానీ, శివరాత్రి కానీ ఇటువంటి పర్వదినాలలో లెక్కపెట్టకుండా తోచినన్ని పార్ధివలింగాలని చేసి పూజించువాడు ముక్తి పొంది తీరుతాడు. నాకు భూమి కావాలి, కాస్త స్థలమో, పొలమో కావాలి అనుకున్నవాడు వెయ్యి పార్ధివలింగాలని భక్తితో పూజించినవాడు, అభిషేకించినవాడు తప్పక భూమిని పొందుతాడు. శివానుగ్రహం ఒకటే కావాలనుకున్న వాడు, పరమేశ్వరుని యెుక్క కరుణ కావాలనుకున్న వాడు, 3000 పార్ధివలింగాలని అభిషేకం చేసుకోవాలి. అభిషేకాలు, అర్చనలు ఇంట్లో కంటే  గుడిలో, గుడిలో కంటే తీర్ధ స్థలాలలో, నదీ తీరాలలో ఇంకొంచెం ఎక్కువ ఫలితాన్ని ఇస్తాయి. అదే గంగానదీ తీరంలో చేసుకుంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. కాశీ వంటి దివ్య క్షేత్రాలలో గంగాతీరంలో చేసుకుంటే అనంత ఫలితం ఇస్తుంది. ఇలా వారి వారి శక్తిని బట్టి చేసుకోమన్నారు. ఆర్ధికంగా చితికిపోయిన వారికి ఇది ఒక గొప్ప అవకాశం. శివుడు అవ్యాజకరుణామూర్తి. ఒకవేళ మన దగ్గర ధనం లేదు, అభిషేకము చేయడానికి పంచామృతాలు లేవు, అప్పుడు ఇన్ని నీళ్లు జల్లినా సంతోషిస్తాడు. - శ్రీ శివమహాపురాణం 

శ్రీ శివ పంచాక్షరీ స్తోత్రమ్👇


శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్👇


తృణావర్తుని వధ👇


expand_less