Nov 20 2022నవంబర్ 20 2022favorite_border

" కాలం - అనుకూలం " 
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబర్ 20 2022 🌟
 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం 
దక్షిణాయనం శరదృతువు  
కార్తికమాసం కృష్ణపక్షము 

తిథి : ఏకాదశి ఈ రోజు ఉదయం 07గం౹౹22ని౹౹ వరకు తదుపరి ద్వాదశి (21) ఉదయం 07గం౹౹24ని౹౹ వరకు
వారం : భానువారం  (అదివారం)
నక్షత్రం : హస్త ఈ రోజు రాత్రి 10గం౹౹41ని౹౹ వరకు తదుపరి చిత్త
యోగం :   ప్రీతి   రాత్రి 11గం౹౹04ని౹౹ వరకు తదుపరి ఆయుష్మాన్
కరణం :   బాలవ ఈ రోజు ఉదయం 10గం౹౹41ని౹౹ వరకు  తదుపరి కౌలవ
రాహుకాలం : ఈ రోజు సాయంత్రం 04గం౹౹30ని౹౹ నుండి 06గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఈ రోజు సాయంత్రం 03గం౹౹53ని౹౹ నుండి 04గం౹౹38ని౹౹ వరకు
వర్జ్యం :  ఉదయం 06గం౹౹33ని౹౹ నుండి 08గం౹౹12ని౹౹ వరకు
అమృతకాలం : సాయంత్రం 04గం౹౹28ని౹౹ నుండి 06గం౹౹07ని౹౹ వరకు
సూర్యోదయం : ఉదయం 06గం౹౹10ని౹౹
సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹20ని౹౹

👉🏻🕉️ఏకాదశి🕉️

ఏకాదశీ ఉపవాసం ఈ రోజు ఉండాలి. ఉపవాసం ఉన్నవారు ద్వాదశీ పారణ (భోజనం) రేపు (21) ఉదయం 07గం౹౹24ని౹౹ లోపు చేయాలి.

గురుబోధ

కార్తికమాసం 26వ రోజు తోటకూర, గోంగూర, బచ్చలికూర వంటి ఆకుకూరలు, గుండ్రంగా ఉండే కంద దుంప దక్షిణతో పాటు స్వయంపాకంగా దానం చెయ్యండి. ఆకుకూరలు, కంద దానం చేసేటటువంటి వారి కుటుంబం పచ్చగా ఉంటుంది, వాళ్ళకి వంశాభివృద్ధి కలుగుతుంది అని బృహస్పతి అంతటివారు చెప్పినమాట. వీలున్నటువంటి వారు మినపపప్పును దానం చెయ్యండి. మినప పప్పు, మినప గుళ్ళు దానం చేస్తే సంపూర్ణ నవగ్రహ అనుగ్రహం కలుగుతుంది.
ఈ రోజు మధ్యాహ్నం పూట చేసే ప్రదక్షిణ సాయంకాల ప్రదక్షిణ కంటే, ఉదయం పూట ప్రదక్షిణ కంటే ఎక్కువ ఫలితం ఇస్తుంది. ఈ ఒక్క రోజే ఆ ప్రత్యేకత వుంది. 

పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది

expand_less