Nov 19 2024నవంబరు 19 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 19 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం

తిథి: చతుర్థి రా. 9.06 కు తదుపరి పంచమి 20 రా. 8.36 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: ఆర్ద్ర రా. 7.05 కు తదుపరి పునర్వసు 20 రా. 7.10 కు
యోగం: సాధ్య మ. 02.56 కు తదుపరి శుభ 20 మ. 01.08 కు
కరణం: బాలవ మ. 05.28 కు తదుపరి కౌలవ 20 తె. 05.02 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ. 08.39 - 09.24 కు & రా. 10.45 - 11.36 కు
వర్జ్యం: లేదు
అమృతకాలం: ఉ. 9.07 - 10.41 కు
సూర్యోదయం: ఉ. 6.23 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు

🕉️ సంకటహర చతుర్థి, ఆర్ద్ర నక్షత్రం🕉️

గురుబోధ:
గణేశుని అనుగ్రహం కోసం ప్రతిమాసం కృష్ణపక్షం లో వచ్చే చతుర్థిన సంకటహర చతుర్థీ వ్రతం ఆచరిస్తారు.

శ్రీ గణేశ పంచరత్నమాలా స్తోత్రం👇
https://youtu.be/V9W-UfGJ4uY?si=KcbKrWzwx9dhesuO
🕉👆విఘ్నాలను, ఆటంకాలను, భయంకరమైన రోగాలను తొలగించి అనుకున్న కార్యక్రమాలలో విజయాన్ని ప్రసాదిస్తుంది.
🕉👆ఈ స్తోత్రం పారాయణం చేసినా లేక విన్నా కూడా అద్భుత ఫలితాలు లభిస్తాయి. అనుకున్న పనులు అయ్యి తీరుతాయి. ముఖ్యంగా చతుర్థి , సంకటహరచతుర్థి ఈ స్తోత్రాన్ని పారాయణం చేయడం ఎంతో మంచిది.

శ్రీ గణేశ భుజంగ స్తోత్రం👇
https://youtu.be/tOm3F2CXUOg?si=nninXL-i109Cj9Et
🕉👆ఉద్యోగం కావాలనుకున్నవారు 40 రోజుల పాటు ఈ స్తోత్రాన్ని వినండి, పారాయణం చెయ్యండి, ఉద్యోగం వచ్చి తీరుతుంది, విదేశీయానప్రాప్తి.
🕉👆భార్యాభర్తల మధ్యలో కీచులాటలు ఎక్కువైపోతున్నప్పుడు తొమ్మిది (9) చతుర్థీ (చవితి) తిథులలో అనగా వరుసగా చవితి వచ్చినప్పుడల్లా, పారాయణం చేసినా, విన్నా భార్యాభర్తల మధ్యలో ఐకమత్యం వస్తుంది.

expand_less