" కాలం - అనుకూలం " ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం. తిథి- సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐 🌟 నవంబర్ 19 2022 🌟 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం కృష్ణపక్షము తిథి : దశమి ఈ రోజు ఉదయం 06గం౹౹46ని౹౹ వరకు తదుపరి ఏకాదశి వారం : స్థిరవారం (శనివారం) నక్షత్రం : ఉత్తర ఈ రోజు రాత్రి 09గం౹౹52ని౹౹ వరకు తదుపరి హస్త యోగం : విష్కoభ రాత్రి (20) 12గం౹౹26ని౹౹ వరకు తదుపరి ప్రీతి కరణం : విష్టి ఈ రోజు ఉదయం 10గం౹౹29ని౹౹ వరకు తదుపరి బవ రాహుకాలం : ఈ రోజు ఉదయం 09గం౹౹00ని౹౹ నుండి 10గం౹౹30ని౹౹ వరకు దుర్ముహూర్తం : ఈ రోజు ఉదయం 06గం౹౹24ని౹౹ నుండి 07గం౹౹38ని౹౹ వరకు వర్జ్యం : లేదు అమృతకాలం : మధ్యాహ్నం 02గం౹౹12ని౹౹ నుండి 03గం౹౹54ని౹౹ వరకు సూర్యోదయం : ఉదయం 06గం౹౹09ని౹౹ సూర్యాస్తమయం : సాయంత్రం 05గం౹౹21ని౹౹ గురుబోధ కార్తికమాసం 25వరోజు జమ్మి చెట్టు క్రింద ఆవు నెయ్యి లేదా నువ్వుల నూనెతో దీపం వెలిగించి, జమ్మి చెట్టుకు ప్రదక్షిణలు చేయాలి. ఇలా చేయడం వల్ల శని దోషాలు, జాతక దోషాల వల్ల వ్యాపారం, ఉద్యోగం, తలపెట్టిన ప్రతి పనిలోను ఎదురయ్యే ఆటంకాలు తొలగి అన్నింటా విజయం పొందుతాము. ఓపిక లేక ఆరోగ్యం సహకరించని వారు ఇరవై ఏడు, లేదా తొమ్మిది చేయవచ్చు. జమ్మి చెట్టుకు ప్రదక్షిణ చేస్తున్నంత సేపు జమ్మి చెట్టును శనీశ్వరుడికి ప్రతీకగా భావించి భక్తి శ్రద్ధలతో ప్రదక్షిణలు చేస్తే శనిదోషాలు, జాతకదోషాలు తొలగుతాయి. పూజ్య గురువులు బ్రహ్మశ్రీ వద్దిపర్తి పద్మాకర్ గారిచే సమగ్ర శ్రీమద్ రామాయణం ప్రవచనం 36 రోజులు - గుంటూరు శ్రీ శారదా పీఠంలో నవంబర్ 24వ తేది గురువారం 2022 నుండి డిసెంబర్ 29వ తేది గురువారం 2022 వరకు జరుగుతుంది