Nov 18 2025నవంబరు 18 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 18 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం

తిథి: త్రయోదశి ఉ.8.57 కు తదుపరి చతుర్దశి 19 ఉ.10.40 కు
వారం: భౌమవారము (మంగళవారం)
నక్షత్రం: స్వాతి 19 ఉ.7.49 కు తదుపరి విశాఖ 20 ఉ.10.25 కు
యోగం: ఆయుష్మాన్ ఉ.8:08 కు తదుపరి సౌభాగ్య 19 ఉ.8:00 కు
కరణం: వణిజ ఉ.7.12 కు తదుపరి విష్టి రా.8.27 కు
రాహుకాలం: మ. 03.00 - 04.30 కు
దుర్ముహూర్తం: ఉ.8:40-9:25 కు, ఉ.10:44-11:35 కు
వర్జ్యం: ఉ.11.32-1.18 కు
అమృతకాలం: రా.10.06-11.53 కు
సూర్యోదయం: ఉ. 6:22 కు
సూర్యాస్తమయం: సా. 5:37 కు

🕉️ కార్తికమాస శివరాత్రి, భౌమచతుర్దశి, కృష్ణాంగారక చతుర్దశి🕉️

గురుబోధ:
🕉️చతుర్థీ తిథి మంగళవారం వస్తే ఆ పర్వదినమును అంగారక చతుర్థి లేదా భౌమచతుర్థి అంటారు. మానవులై పుట్టాక ఏదో ఒక ఋణం మనలను పట్టి పీడిస్తూ ఉంటుంది. ఋణసంబంధమైన విముక్తి అంత తేలిక కాదు. అందునా ధనసంబంధమైన ఋణాలు మానవులని బాగా పట్టి పీడిస్తుంటాయి. ఇతరులు మనకు అప్పు ఉండి ఆ అప్పు తీర్చకపోయినా, మనం ఇతరులకు ఇవ్వవలసిన సొమ్ము ఇవ్వలేకపోయినా ఈ రెండు రకాల ఋణాల నుండి విముక్తి పొందడానికి భక్తి శ్రద్ధలతో కుజస్తోత్రమును పారాయణం చేయమని సాక్షాత్తూ బ్రహ్మదేవుడు కుమారస్వామికి చెప్పాడు. అందువలన ఈ స్తోత్రాన్ని తప్పక భక్తి శ్రద్ధలతో పారాయణ చేసుకున్నా, విన్నా సకల ఋణాలూ తొలగిపోతాయి. అందునా మంగళవారమునాడు ఈ దివ్య స్తోత్రాన్ని పారాయణ చేసుకున్నా లేక విన్నా, తక్షణం ఋణవిముక్తి అవుతుంది.
🕉️ప్రదోషవేళ మాసశివరాత్రిరోజున చేసే శివారాధన, శివపూజ, శివాభిషేకం విశేషమైన శివానుగ్రహాన్ని ప్రసాదిస్తుంది. ఈ సమయంలో శివసహస్రనామం వినడం సర్వశుభాలను అనుగ్రహిస్తుంది. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు.

శివసహస్రనామ స్తోత్రమ్👇
https://youtu.be/AcS0VMMx3lU?si=XBKdVWZSit6nW-ha
ఋణవిమోచన అంగారక(కుజ) స్తోత్రము👇
https://youtu.be/Ij6aTtQF42Y?si=TmOsGcnDLMFOEnRo

expand_less