Nov 18 2024నవంబరు 18 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 18 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం

తిథి: తదియ రా. 10.04 కు తదుపరి చతుర్థి 19 రా. 9.06 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: మృగశిర రా. 7.27 కు తదుపరి ఆర్ద్ర 19 రా. 7.05 కు
యోగం: సిద్ధ సా. 05.22 కు తదుపరి సాధ్య 19 మ. 02.56 కు
కరణం: వణిజ ఉ. 07.56 కు తదుపరి విష్టి సా. 06.55 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ. 12.24 - 01.09 కు & మ. 02.39 - 03.24 కు
వర్జ్యం: తె. 3.42 - 5.17 కు
అమృతకాలం: ఉ. 10.48 - 12.21 కు
సూర్యోదయం: ఉ. 6.23 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు

🕉️ కార్తిక సోమవారం 🕉️

గురుబోధ:
విభూతి ధరించినవాడిని అవహేళన చేసేవాడు మహాపాపి అవుతాడు. అటువంటివారు శరీరం విడిచిపెట్టాక నరకం పాలై, ఆ తరువాత, పందిగా, రాక్షసుడిగా, గాడిదగా, కుక్కగా, నక్కగా, పురుగుగా పుట్టి అనేక బాధలనుభవిస్తారు. భస్మం ధరించినవారిని నిందించేవారు మందబుద్ధులు. శివధనాపహరణం, శివనింద చేయడం అనబడే ఈ రెండు పాపాలకూ మాత్రం ప్రాయశ్చితం లేదు. విభూతిని మూడు రేఖలుగా ధరించేవాడు మరణించిన వారిని వేయితరాలవారిని, రాబోయే వేయితరాలవారిని ఉద్ధరిస్తాడు. త్రిపుండ్ర భస్మధారణ చేసిన వాడు దీర్ఘాయువు పొందుతాడు. వ్యాధులనుండి విముక్తిని పొందుతాడు. భోగాలనుభవిస్తాడు. చివరిలో సుఖమరణం పొందుతాడు. శరీరం విడిచిపెట్టాక దివ్య శరీరం ధరించి, అనేక విధాలుగా సద్గతులు పొందుతాడు. విభూతిని నిందించేవాడు బ్రహ్మాయుర్దాయం ఉన్నంతకాలం నరకం పొందుతాడు. కాబట్టి ఏ పరిస్థితులలోనూ భస్మనింద మాత్రం చేయరాదు.

expand_less