Nov 17 2025నవంబరు 17 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 17 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం

తిథి: ద్వాదశి ఉ.7.10 కు తదుపరి త్రయోదశి 18 ఉ.8.57 కు
వారం: ఇందువారము (సోమవారం)
నక్షత్రం: చిత్త 18 తె.5.20 కు తదుపరి స్వాతి పూర్తి
యోగం: ప్రీతి ఉ.7:22 కు తదుపరి ఆయుష్మాన్ 18 ఉ.8:08 కు
కరణం: గరజి సా. 5.59 కు తదుపరి వణిజ 18 ఉ.7.12 కు
రాహుకాలం: ఉ. 07.30 - 09.00 కు
దుర్ముహూర్తం: మ.12:23-1:07 కు, మ. 2:37-3:21 కు
వర్జ్యం: మ.12.04-1.40 కు
అమృతకాలం: రా.9.52-11.39 కు
సూర్యోదయం: ఉ. 6:22 కు
సూర్యాస్తమయం: సా. 5:37 కు

🕉️ 4వ కార్తిక సోమవారం (ఈ సంవత్సరంలో చివరి కార్తిక సోమవారం), సంత్ జ్ఞానేశ్వర పుణ్యతిథి, ప్రదోషము, ధన్వంతరీ జయంతి, త్రయోదశి నందీశ్వర అభిషేకం 🕉️

గురుబోధ:
🕉️ఉదయం పూట, మధ్యాహ్నానికి కొంచెం ముందు శివలింగ దర్శనం అత్యంత శుభప్రదం. సూర్యోదయానికి ముందు 20ని.లు, సూర్యాస్తమయం తరువాత 20 ని.లు ఈ కాలాన్ని ప్రదోషకాలము అంటారు. ఆ సమయంలో శివదర్శనం, శివారాధన, శివ పూజ, శివాభిషేకము, జపము చాలా విశేషమైనది, చేసుకొన్నవాడికి పునర్జన్మ ఉండదు. శివాలయంలో శివలింగం బయట కాని ఆలయ గోపురంపై కాని శివవిగ్రహం ఉంటే, ఆ ఆలయంలో పూజాదికాలు నిర్వహించినవారికి శివపదం వస్తుంది. శివలింగం యొక్క పీఠం లేక పానవట్టం అమ్మవారు. శివలింగం చేతనాత్మకమైన శివస్వరూపం. పానవట్టంతో కూడిన శివలింగం పార్వతీపరమేశ్వరుల ఐక్యరూపం.
🕉️చెట్లు, తీగలు మొదలైన వాటిని స్థావరలింగాలు అంటారు. వీటికి నీరు పోసి పోషిస్తే శివుని స్థావరలింగపూజగా శివుడు భావిస్తాడు. కాబట్టి శివభక్తులు వీటిని పోషించాలి. పక్షులు, జంతువులు జంగమాలు అనబడతాయి. వీటిని రక్షించి పోషిస్తే శివుని జంగమలింగపూజ అవుతుంది. కాబట్టి వీటిని కూడా పోషించి రక్షించాలి. ఈ మొత్తం పూజను ప్రకృతిపూజగా అనగా అమ్మవారి పూజగా శాస్త్రాలు పేర్కొంటున్నాయి. ఇది నిజమైన శివపూజ. శివాలయం తుడిచినవాడు, కడిగి శుభ్రం చేసినవాడు, శివుడి కోసం పూలతోట పెంచి, అందులోని పూలను శివునకు అర్పించినవాడు శివపదం పొందుతాడు. బ్రతికినంతకాలం సంపదలు పొందుతాడు.

expand_less