Nov 17 2024నవంబరు 17 2024favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 17 2024 🌟
శ్రీ క్రోధి నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం

తిథి: విదియ రా. 11.26 కు తదుపరి తదియ 18 రా. 10.04 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: రోహిణి రా. 8.12 కు తదుపరి మృగశిర 18 రా. 7.27 కు
యోగం: శివ రా. 08.21 కు తదుపరి సిద్ధ 18 సా. 05.22 కు
కరణం: తైతుల ఉ. 10.24 కు తదుపరి గరజి రా. 09.06 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: మ. 04.10 - 04.55 కు
వర్జ్యం: మ. 12.33 - 2.05 కు & రా. 1.37 - 3.10 కు
అమృతకాలం: సా. 5.01 - 6.32 కు
సూర్యోదయం: ఉ. 6.22 కు
సూర్యాస్తమయం: సా. 5.40 కు

గురుబోధ:
రుద్రాక్షలు వేదస్వరూపాలు. సకల పాపాలనూ నాశనం చేయగలవు. శివభక్తులు రుద్రాక్ష ధరిస్తే భుక్తి ముక్తులు రెండూ లభిస్తాయి. పెద్ద ఉసిరికాయ అంత ఉండే రుద్రాక్ష ఉత్తమం. బదరీ ఫలం (రేగిపండు) అంత ఉండేది మధ్యమం. సెనగగింజ అంత ఉంటే అధమం, అని రుద్రాక్షలో హెచ్చుతగ్గులున్నాయి. ఏ రుద్రాక్ష అయినా సరే ధరించేవారికి ఏదో ఒక ఫలితం ఇచ్చి తీరుతాయి. ఉసిరికాయ అంత ఉండే రుద్రాక్ష ధరిస్తే కష్టాలు తొలగుతాయి. రేగుపండంత ఉండే వాటిని ధరిస్తే సంపదలూ, సౌఖ్యాలు, ఆనందం కలుగుతాయి. గురివింద గింజ అంత ఉండే రుద్రాక్ష ధరిస్తే అనుకున్న పనులు నెరవేరుతాయి. రుద్రాక్షలు చిన్నవైనా ఫలితం గొప్పది. రుద్రాక్షలకు పైన బొడిపెలు లేకుండా నున్నగా ఉంటే అవి ధరించడానికి పనికిరావు. పురుగులు పట్టినా, పగిలినా, విరిగినా వృత్తాకారంలో లేకపోయినా, రుద్రాక్షలను ధరించరాదు. రుద్రాక్షలు స్వతస్సిద్ధంగా కన్నాలు కలిగినవి శ్రేష్ఠాలు. మనం కన్నాలు పొడిస్తే అవి ద్వితీయాలు.

expand_less