Nov 17 2023నవంబరు 17 2023favorite_border

"కాలం - అనుకూలం"
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది(7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము(27 యోగములు) కరణం - కార్యసిద్ధి(11 కరణములు) 
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐     
     🌟 నవంబరు 17 2023 🌟
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తికమాసం శుక్లపక్షము

తిథి : చతుర్థి  ఉ. 11గం౹౹32ని౹౹ వరకు తదుపరి పంచమి
వారం : భృగువారము (శుక్రవారం)
నక్షత్రం : పూర్వాషాఢ రా. 02గం౹౹34ని౹౹ వరకు తదుపరి ఉత్తరాషాఢ
యోగం : ధృతి ఉ. 07గం౹౹37ని౹౹ వరకు తదుపరి శూల
కరణం :  విష్టి ఉ. 11గం౹౹03ని౹౹ వరకు తదుపరి బవ
రాహుకాలం : ఉ. 10గం౹౹30ని౹౹ నుండి 12గం౹౹00ని౹౹ వరకు
దుర్ముహూర్తం : ఉ. 08గం౹౹23ని౹౹ నుండి 09గం౹౹08ని౹౹ వరకు & మ. 12గం౹౹08ని౹౹ నుండి 12గం౹౹54ని౹౹ వరకు
వర్జ్యం : మ.12గం౹౹46ని౹౹ నుండి 02గం౹౹18ని౹౹ వరకు
అమృతకాలం : రా. 09గం౹౹59ని౹౹ నుండి 11గం౹౹31ని౹౹ వరకు
సూర్యోదయం : ఉ. 06గం౹౹08ని౹౹కు
సూర్యాస్తమయం : సా. 05గం౹౹21ని౹౹కు

🕉️ కార్తిక శుద్ధ చతుర్థి - నాగ చతుర్థి, నాగులచవితి🕉️ 

గురుబోధ
సర్పదోషాలతో ఇబ్బంది పడేవారు, సంతాన సమస్యలతో బాధపడేవారు, తీవ్ర అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పడేవారు ఈ రోజు నాగ చతుర్థిని భక్తిశ్రద్ధలతో ఆచరించి నాగ అష్టోత్తర శతనామవళితో పూజ చేసి, నాగ ప్రతిమలను అభిషేకం చేస్తే సర్పబాధలు వాళ్ళకి ఉండవు. సుబ్రహ్మణ్య ఆరాధన లేదా మానసాదేవి ఆరాధన వలన కూడా సర్ప దోషాలు, రాహు,కేతు గ్రహదోషాలు తొలగుతాయి. సుబ్రహ్మణ్య అష్టకం లేదా మానసాదేవి దివ్యచరిత్ర, స్తోత్రం, పూజ, జపం కూడా విశేష ఫలితం ఇస్తుంది. వంశంలో చేసిన భయంకర నాగాపచారాలు  కూడా తొలగిపోవాలంటే నాగదోష పరిహార స్తోత్రం పఠించాలి లేదా శ్రవణం చేయాలి.
నాగదేవతా మూర్తులు లేదా ఏ ఇతర విగ్రహమూర్తులకు అయినా పాలతో అభిషేకం చేసిన తర్వాత, తప్పక నీటితో శుభ్రంగా అభిషేకం చేయాలి.

నాగదోష పరిహార స్తోత్రమ్👇


మానసాదేవి దివ్యచరిత్ర👇


కార్తికమాసంలో వినవలసిన దామోదర లీలలు👇


పరద్రవ్యం అపహరించిన పాపం తొలగడానికి, ఋణవిముక్తికి శివారాధన👇


expand_less