Nov 16 2025నవంబరు 16 2025favorite_border

కాలం - అనుకూలం
ప్రతిరోజూ పంచాంగం తెలుసుకొంటే ఈ క్రింది ప్రయోజనములు కలుగుతాయని శాస్త్రం.
తిథి - సంపదలు కలుగుతాయి (15 తిథులు: శుక్ల, కృష్ణ పక్షములలో) వారము - ఆయుష్షు పెరుగుతుంది (7 రోజులు) , నక్షత్రము - పాపము తొలగుతుంది (27 నక్షత్రములు) యోగము -రోగనివారణము (27 యోగములు) కరణం - కార్యసిద్ధి (11 కరణములు)
卐ॐ ఓం శ్రీ గురుభ్యోనమః ॐ卐
🌟 నవంబరు 16 2025 🌟
శ్రీ విశ్వావసు నామ సంవత్సరం
దక్షిణాయనం శరదృతువు కార్తిక మాసము కృష్ణ పక్షం

తిథి: ద్వాదశి 17 ఉ.7.10 కు తదుపరి త్రయోదశి 18 ఉ.8.57 కు
వారం: భానువారము (ఆదివారం)
నక్షత్రం: హస్త రా.3.26 కు తదుపరి చిత్త 18 తె.5.20 కు
యోగం: విష్కంభ ఉ.6:46 కు తదుపరి ప్రీతి 17 ఉ.7:22 కు
కరణం: కౌలవ మ. 3.40 కు తదుపరి తైతుల తె.4.48 కు
రాహుకాలం: సా. 04.30 - 06.00 కు
దుర్ముహూర్తం: సా.4:06-4:51 కు
వర్జ్యం: ఉ.10.49-12.30 కు
అమృతకాలం: రా.7.31-9.18 కు
సూర్యోదయం: ఉ. 6:22 కు
సూర్యాస్తమయం: సా. 5:37 కు

ఏకాదశీ ఉపవాసం ఉన్నవారు ద్వాదశీపారణ ఈరోజు చేయాలి.

🕉️ వృశ్చికా సంక్రమణం🕉️

గురుబోధ:
శ్రీ మహావిష్ణు వేదస్తుతి (గాలవ ముని కృతం) - ఇందులో చతుర్వేదములు, ఉపనిషత్తుల యొక్క సారం నిక్షిప్తమై ఉన్నది. అందుకే ఇది వేదస్తుతి. ఇది విన్నా కూడా మనమే స్వయంగా స్తుతించిన, రచించిన ఫలితం పొందుతాము. వీలున్నప్పుడల్లా ఇది విన్నా, ముఖ్యంగా అమావాస్యలలో, సంక్రమణ (సంక్రాంతి) పర్వదినాలలో, గ్రహణాలలో, నదీస్నానాలలో ఈ స్తోత్రం వింటే తిరుగులేనటువంటి శక్తి పొందుతాము. శ్రీ మహావిష్ణువు ఈ స్తోత్రం విన్నవారిని రక్షించే బాధ్యత తనదేనని, రక్షణకై తన సుదర్శన చక్రమే పంపుతానని అన్నాడు. ఇది హరిరక్షణ పొందించే అద్భుత స్తోత్రం. జీవితంలో ఎప్పుడో ఒకప్పుడు మనం పొందే కష్టాల నుండి బయటపడవేసే అపూర్వ స్తోత్రం.👇
https://youtu.be/UwFKCtE_fRU?si=m3vkJn-ToLnCtlhy
సంపూర్ణ సంకల్ప సహిత కార్తికస్నానం ప్రతిరోజూ చేయాలి. కుంకుమ లేదా భస్మధారణ చేయాలి. శివకేశవులకు అభేదం అని గుర్తించాలి. ప్రతిరోజూ సంకల్పసహిత కార్తిక స్నానం నామము ధరించటం, కార్తిక దీపం వెలిగించటం, ఆకాశ దీపం దర్శనం చేయటం, గురువులను, దైవాన్ని దర్శనం చేసుకోవటం, ప్రదక్షిణలు చేయటం, శక్తి మేర స్వయంపాకం దానం ఇవ్వటం ఉత్తమం.

https://youtube.com/c/BrahmasriVaddipartiPadmakarOfficial
expand_less